సభలో వైసీపీ ఎమ్మెల్యేకు బీపీ డౌన్...

శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి హాజరైన నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హఠాత్తుగా బీపీ డౌన్ అయ్యింది.

news18-telugu
Updated: December 10, 2019, 11:12 AM IST
సభలో వైసీపీ ఎమ్మెల్యేకు బీపీ డౌన్...
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి హాజరైన నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హఠాత్తుగా బీపీ డౌన్ అయ్యింది. దీంతో సమావేశాలు జరుగుతుండగానే ఆయన మధ్యలో నుంచి బయటకు వచ్చేశారు. వెంటనే వైసీపీ శాసనసభాపక్ష కార్యాలయంలోకి వెళ్లారు. ఆయనకు రక్తపోటు తగ్గిందని గుర్తించిన వైద్యులు... వెంటనే ఆయనకు చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆరోగ్యం గురించి వాకబు చేశారు.


First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>