ఫారెస్ట్ అధికారిణి అనిత దాడి కేసులో ట్విస్ట్...

హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్లాంటేషన్ కోసం అటవీ భూమిని పదును చేసేందుకు వెళ్లిన అటవీ అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు.

news18-telugu
Updated: June 30, 2019, 3:58 PM IST
ఫారెస్ట్ అధికారిణి అనిత దాడి కేసులో ట్విస్ట్...
ఫారెస్ట్ అధికారిణి అనిత దాడి కేసులో ట్విస్ట్..., koneru krishna resign to zp vice chairperson post in forest officer attack case
  • Share this:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ నగర్ అడవి శాఖ అధికారి అనిత పై దాడి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ దాడి విషయంలో తనపై విమర్శలు రావడంతో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవికి కోనేరు కృష్ణ రాజీనామా చేశారు. పొడు భూముల రైతులపై అటవీశాఖ సిబ్బంది అధికారుల జులుంకు నిరసనగా  తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కృష్ణతో సహా దాడికి పాల్పడిన 12 మందిపై పోలీస్ శాఖ కేసులు నమోదు చేశారు.వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితుల్నిగుర్తించిన పోలీసులు కోనేరు కృష్ణ, గొల్ల పోషం,పూదడి సుధాకర్,పుల్ శ్రీకాంత్,కొట్టె మల్లేశ్, బిచ్చెర శంకర్,బిచ్చెర రాజేష్‌పై కేసు నమోదు చేశారు. అనితపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కాగజ్ నగర్ డీఎఫ్‌ఓ రమణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు అనితపై దాడిని ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఓ మహిళా ఆఫీసర్‌పై దాడి చేయడం తీవ్రమైన చర్యగా పేర్కొంది. ఘటనకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది.

హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్లాంటేషన్ కోసం అటవీ భూమిని పదును చేసేందుకు వెళ్లిన అటవీ అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలతో అధికారులపై దాడి చేశారు. ఈ దాడిలో సిర్పూర్ ఎమ్మెల్యే కోణప్ప సోదరుడు, ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ కోనేరు కృష్ణారావు, ఆయన అనుచరులు ఉన్నారు.

First published: June 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>