కొండా విశ్వేశ్వర్ రెడ్డి వికెట్ ఔట్.. నెక్ట్స్ ఎవరు?

డీఎస్ అధికారికంగా టీఆర్ఎస్‌లో ఉన్నా.. ఆయన మనసు మాత్రం కాంగ్రెస్‌లోనే ఉంది. ఇప్పుడు కొండా రాజీనామా చేశారు. సీతారాం నాయక్ కూడా టీఆర్ఎస్‌ను వీడతారా?

news18-telugu
Updated: November 20, 2018, 6:28 PM IST
కొండా విశ్వేశ్వర్ రెడ్డి వికెట్ ఔట్.. నెక్ట్స్ ఎవరు?
సీతారాం నాయక్, విశ్వేశ్వర్ రెడ్డి
  • Share this:
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కారు దిగారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేశారు. తెలంగాణ వ్యతిరేకులను కేబినెట్‌లోకి తీసుకుని, తనలాంటి తెలంగాణవాదులను విస్మరించారని ఆయన ఆరోపించారు. దీంతో పాటు పార్టీలో తనకు ప్రాధాన్యం కల్పించడం లేదని ఆయన అలక వహించారు. కొన్ని సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకొచ్చినా కనీసం వాటి గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ క్రమంలో పార్టీని మారుతున్నానని, త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ ఆయన కేసీఆర్‌కు మూడు పేజీల లేఖ రాశారు. ఈనెల 23న సోనియాగాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి వికెట్ పడింది. తర్వాత ఎవరు? గతంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యల ప్రకారం.. మరో ఎంపీ కూడా ఎన్నికలకు ముందే టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరాలి. ఒకరు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అయితే, మరొకరు ఎవరనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినప్పుడు మంత్రి కేటీఆర్ కొండాతో పాటు మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్‌ను పిలిపించి మాట్లాడారు. వారు పార్టీ మారడం లేదని ప్రకటించారు. అలా ప్రకటించిన వారం రోజుల్లోనే చేవెళ్ల ఎంపీ టీఆర్ఎస్‌కు రాజీనామా చేయడంతో సీతారాం నాయక్ కూడా పార్టీ మారతారా అనే చర్చ జరుగుతోంది.

ఇప్పటికే టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్.. ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ఓ రకంగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో టచ్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో హస్తం నేతలు డీఎస్‌కు కొన్ని కీలక బాధ్యతలు కూడా అప్పగించినట్టు సమాచారం. అంటే డీఎస్ అధికారికంగా టీఆర్ఎస్‌లో ఉన్నా.. ఆయన మనసు మాత్రం కాంగ్రెస్‌లోనే ఉంది. ఇప్పుడు కొండా రాజీనామా చేశారు. సీతారాం నాయక్ కూడా పార్టీని వీడితే తెలంగాణ ఎన్నికల ముందు అధికార పార్టీకి భారీ షాక్ తగులుతుందని అంచనా వేస్తున్నారు.
First published: November 20, 2018, 6:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading