తెలంగాణలోని హుజూరాబాద్‌లో కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేయనున్నారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక్కడ అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లాగుల్లాలు పడుతోంది. అభ్యర్థి ఎంపిక కోసం వేసిన కమిటీ పలువురు పేర్లను ఖరారు చేసినప్పటికీ.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌తో జరిగిన సమావేశంలో నేతల అభిప్రాయంతో సీన్ మారిపోయింది. అభ్యర్థి ఎంపికను ఇలా ఎలా చేపడతారని కొందరు నేతలు గట్టిగా ప్రయత్నించడంతో.. ఠాగూర్ కొత్త పల్లవి అందుకున్నారు. పోటీ చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు. అది కూడా సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో మాణిక్యం ఠాగూర్ చెప్పిన విధంగా అభ్యర్థిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ నేతలు భావించారు.
అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీలకు గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్న మాజీమంత్రి కొండా సురేఖకు ఈ పరిణామాలు ఏ మాత్రం రుచించడం లేదని తెలుస్తోంది. కొండా సురేఖ హుజూరాబాద్ రేసులో నిలిచేందుకు టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ఎంతగానో ప్రయత్నించిందనే వార్తలు వచ్చాయి. ఆమెను ఇక్కడ పోటీ చేయించాలని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ఆమెను ఒప్పించారని.. అధిష్టానంతో మాట్లాడి ఆమె పేరును ఖరారు చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగింది. అయితే.. కట్ చేస్తే కొందరు నేతలు ఈ విషయంలో మాణిక్యం ఠాగూర్ ముందు ప్రస్తావించారు.
స్థానికులను కూడా స్థానికేతరులకు హుజూరాబాద్‌లో పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని కొత్త అంశాన్ని లేవనెత్తారు. బీజేపీ, టీఆర్ఎస్‌లకు భిన్నంగా మనం నిర్ణయం తీసుకుంటే నష్టపోతామని వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీ స్థానిక అభ్యర్థినే ఎంపిక చేశారని వ్యాఖ్యానించారు. దీంతో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేయాలని మాణిక్యం ఠాగూర్ నేతలకు సూచించారు. దీంతో హుజూరాబాద్ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుకున్న దానికి పూర్తి భిన్నంగా జరుగుతోందనే వాదన మొదలైంది.
మరోవైపు ఎలాగైనా హుజూరాబాద్ బరిలో కొండా సురేఖ ఉండేలా చూడాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ఆశలకు గండిపడేలా ఉందనే చర్చ కూడా సాగుతోంది. హుజూరాబాద్‌లో పోటీ చేయలంటే దరఖాస్తు చేసుకోవాలంటూ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ చేసిన ప్రతిపాదనను అంగీకరించబోమని కొండా దంపతులు చెప్పినట్టు సమాచారం.
Huzurabad: ‘హుజూరాబాద్’పై రేవంత్ రెడ్డికు కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇస్తుందా ?
Night: రాత్రిపూట తరచూ గొంతు తడారిపోతుందా ?.. చాలా డేంజర్.. దేనికి సంకేతమో తెలుసా..
తమను పోటీ చేయాలని అధిష్టానం కోరితేనే హుజూరాబాద్‌లో పోటీ చేస్తామని.. లేని పక్షంలో పోటీ చేయడానికి తాము అంగీకరించబోమని కొండా దంపతులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో అసలు హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరపున పోటీ చేయబోయేది ఎవరనే దానిపై కథ మళ్లీ మొదటికి వచ్చిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. హుజూరాబాద్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని.. అందులో భాగంగానే కొండా సురేఖను బరిలోకి దింపాలని భావించారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటంతో.. హుజూరాబాద్‌లో సీన్ మారుతోందనే ప్రచారం మొదలైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Huzurabad By-election 2021, Revanth Reddy, Telangana