వైఎస్‌తో మాట్లాడి గెలిపిస్తే చేసిందేంటి.. గుత్తాకు మతి భ్రమించింది : కోమటిరెడ్డి

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువై.. స్వయంగా ఓటమి కొనితెచ్చుకుంటున్నారని అంతకుముందు గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. భువనగిరి నుంచి పోటీ చేస్తున్న కోమటిరెడ్డి లక్ష ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయమన్నారు.

news18-telugu
Updated: May 17, 2019, 3:16 PM IST
వైఎస్‌తో మాట్లాడి గెలిపిస్తే చేసిందేంటి.. గుత్తాకు మతి భ్రమించింది : కోమటిరెడ్డి
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: May 17, 2019, 3:16 PM IST
కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మతిభ్రమించిందన్న గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఎదురైంది. మతి భ్రమించింది తమకు కాదని కేసీఆర్ ఇచ్చిన షాక్‌కి గుత్తాకే మతిభ్రమించిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. నల్గొండ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ పనైపోయిందన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. పార్టీని బతికించడానికే తాము పోటీ చేస్తున్నామని, అంతే తప్ప తమకేమీ పదవులపై కోరిక లేదని స్పష్టం చేశారు. అప్పట్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మాట్లాడి గుత్తాను ఎంపీగా గెలిపిస్తే.. ఆ తర్వాత మూడు పార్టీలు మారారని విమర్శించారు. గుత్తా లాంటి అవినీతిరుడు దేశంలోనే లేడని ఆరోపించారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువై.. స్వయంగా ఓటమి కొనితెచ్చుకుంటున్నారని అంతకుముందు గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. భువనగిరి నుంచి పోటీ చేస్తున్న కోమటిరెడ్డి లక్ష ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ అహం అణిగేలా తీర్పు వస్తుందన్నారు.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...