• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • KOMATIREDDY VENKAT REDDY GETTING READY TO DO PADAYATRA AND SEEKING PERMISSION FROM ELECTION COMMISSION AK

Komatireddy Venkat Reddy: పాదయాత్రకు సిద్ధమైన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy: పాదయాత్రకు సిద్ధమైన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(ఫైల్ ఫొటో)

Komatireddy Venkat Reddy: ఈనెల 20 నుంచి ప్రాజెక్టుల సాధన యాత్ర పేరుతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారు.

  • Share this:
    తెలంగాణలో మరో కాంగ్రెస్ నేత పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈనెల 20 నుంచి ప్రాజెక్టుల సాధన యాత్ర పేరుతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. పాదయాత్రకు అనుమతి కోరుతూ ఈసీకి కోమటిరెడ్డి లేఖ రాశారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నల్‌ నుంచి జలసౌధ వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖలో వెల్లడించారు. ఇప్పటికే కాంగ్రెస్‌లోని ముఖ్యనేతలు రేవంత్ రెడ్డి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు.

    మరో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క సైతం రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పాదయాత్ర చేస్తున్నారు. తాను కూడా పాదయాత్ర చేస్తానని మరో కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం పాదయాత్ర చేసేందుకు సిద్ధం కావడంతో.. కాంగ్రెస్‌లో పాదయాత్ర చేయాలని భావిస్తున్న నేతల సంఖ్య పెరుగుతోంది.

    నిజానికి తెలంగాణలో టీపీసీసీ చీఫ్ పదవికి పోటీ పెరిగినప్పటి నుంచే నేతలు పాదయాత్ర చేయాలనే అంశంపై దృష్టి పెట్టారు. ఎవరికి వాళ్లు తాము రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తామని ప్రకటించుకున్నారు. అయితే ఇప్పుడు నేతలంతా ఒక్కొక్కరికి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం పాదయాత్రకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు