రేవంత్ రెడ్డిని టెన్షన్ పెడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత...

రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ రేసులో మరో నాయకుడి నుంచి గట్టి పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది.

news18-telugu
Updated: February 22, 2020, 6:56 AM IST
రేవంత్ రెడ్డిని టెన్షన్ పెడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత...
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు చాలామంది నేతల్లో వినిపిస్తున్న టాక్ ఒకటే. రాష్ట్ర కాంగ్రెస్‌కు కాబోయే కొత్త సారథి ఎవరనే దానిపైనే ఇప్పుడు ఆ పార్టీలో అందరి దృష్టి నెలకొంది. ఉత్తమ్ వారసుడు ఎవరనే దానిపై కాంగ్రెస్‌లో ఎప్పటి నుంచో కసరత్తు జరుగుతున్నా... త్వరలోనే దీనిపై ప్రకటన ఉంటుందనే వార్తలు జోరందుకున్నాయి. అయితే ఈసారి కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు రేవంత్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్‌లో అంత బలంగా ఢీకొట్టగలిగే నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రమే అని కాంగ్రెస్‌లో కొందరు నేతలు నమ్ముతున్నారని... రేవంత్ రెడ్డి సైతం తనకు ఈ పదవి ఇవ్వాలని చాలాకాలం నుంచి హైకమాండ్ దగ్గర లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం.

ఇందుకోసం ఆయన ఢిల్లీ స్థాయిలో తనకున్న అన్ని రకాల పరిచయాలను ఉపయోగించుకుంటున్నారనే వాదన ఉంది. అయితే రేవంత్ రెడ్డికి టీ పీసీసీ రేసులో మరో సీనియర్ నేత నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న భువనగిరి ఎంపీ, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... తాను టీపీసీసీ రేసులో ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. తనకు ఒకసారి ఈ ఛాన్స్ ఇవ్వాలని బహిరంగంగానే కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలో సోనియాగాంధీకి కూడా చెబుతానని అన్నారు. దీంతో రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డిని టెన్షన్ పెడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత... | Komatireddy venkat reddy competition with revanth reddy for tpcc president post in telangana congress ak
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(ఫైల్ ఫోటో)


కాంగ్రెస్‌లోనూ, రాజకీయాల్లోనూ రేవంత్ రెడ్డికి ఎంతో సీనియర్ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాదని కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తుందా ? అనే చర్చ కూడా కాంగ్రెస్‌లో మొదలైంది. మరోవైపు కాంగ్రెస్‌లోని కొందరు పెద్దలు సైతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఈ విషయంలో మద్దతు ఇస్తున్నారనే చర్చ సాగుతోంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డిని మరో సీనియర్ నేత టెన్షన్ పెడుతున్నట్టే కనిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: February 22, 2020, 6:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading