అవసరమైతే కొత్త పార్టీ.. కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వార్నింగ్

కేసీఆర్‌ని గద్దె దింపి.. ప్రజలకు బంగారు తెలంగాణ అందించడమే తన లక్ష్యమన్నారు. అందుకోసం దేనికైనా తాను సిద్ధమన్నారు రాజగోపాల్ రెడ్డి.

news18-telugu
Updated: March 6, 2020, 6:28 PM IST
అవసరమైతే కొత్త పార్టీ.. కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వార్నింగ్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (File)
  • Share this:
కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కాంగ్రెస్ హైకమాండ్‌పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. సరైన నిర్ణయాలు తీసుకోకుంటే తన దారి తాను చూసుకుంటానని హెచ్చరించారు. అవసరమైతే బీజేపీలోకి వెళ్లైనా.. లేదంటే సొంత పార్టీ పెట్టైనా.. కేసీఆర్‌పై పోరాడతానని స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి. పీసీసీ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకుంటే కఠిన నిర్ణయం తీసుకుంటానని తేల్చిచెప్పారు. కేసీఆర్‌ని గద్దె దింపి.. ప్రజలకు బంగారు తెలంగాణ అందించడమే తన లక్ష్యమన్నారు. అందుకోసం దేనికైనా తాను సిద్ధమన్నారు రాజగోపాల్ రెడ్డి.

తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం ఉంది. టికెట్లు సరిగా ఇవ్వలేదు. పొత్తులు సరిగా పెట్టుకోలేదు. సరైన నాయకత్వం అందించలేకపోయారని అందుకే నష్టం జరిగిందని మొదటి సారి హైకమాండ్‌కు చెప్పా. రెండోసారి కూడా అదే తప్పు చేయడంతో ఆవేదనతో మాట్లాడా. మా లక్ష్యం ఒక్కటే కేసీఆర్‌ను గద్దె దింపాలి. కాంగ్రెస్ అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకుంటే అందరం కలసి కట్టుగా ముందుకెళ్తాం. లేని పక్షంలో బీజేపీలో చేరడమా.. సొంత పార్టీ పెట్టలా అనేది నిర్ణయించుకుంటా. దేనికైనా నేను రెడీ. కేసీఆర్‌కు బుద్ధి చెప్పి.. దోపిడీని ఆపడమే మా లక్ష్యం. తెలంగాణ ప్రజలకు నిజమైన బంగారు తెలంగాణ అందించాలన్నదే నా ఆశయం.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


కాంగ్రెస్ పార్టీలో కొంత కాలంగా పీసీసీ పదవిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తమ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలహీన పడిందని.. వీలైనంత త్వరగా కొత్త చీఫ్‌ని నియమించాలని కొందరు నేతలు హైకమాండ్ వద్ద పలుమార్లు ప్రస్తావించారు. అంతేకాదు తమకే ఆ పదవిని కట్టబెట్టాలని పలువురు నేతలు సోనియా, రాహుల్ గాంధీకి విజ్ఞప్తులు చేశారు. పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎవరికి వారు హైకమాండ్ వద్ద తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కోమటిరెడ్డి వ్యాఖ్యలు పార్టీలో హాట్‌టాపిక్‌గా మారాయి. పీసీసీ పదవి తనకు ఇవ్వకుంటే పార్టీకి గుడ్‌బై చెబుతానని.. పరోక్ష్యంగా ఆయన హైకమాండ్‌కు వార్నింగ్ ఇచ్చారని చర్చ జరుగుతోంది.
Published by: Shiva Kumar Addula
First published: March 6, 2020, 6:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading