కాంగ్రెస్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..బీజేపీ చేరడం ఖాయమా..?

కోమటిరెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు ఫిక్సయ్యారని..అందుకే ఈ వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: June 15, 2019, 8:14 PM IST
కాంగ్రెస్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..బీజేపీ చేరడం ఖాయమా..?
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(File)
news18-telugu
Updated: June 15, 2019, 8:14 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని.. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని స్పష్టంచేశారు. రాష్ట్రంలో నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారని బాంబు పేల్చారు కోమటిరెడ్డి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి రాష్ట్ర నాయకత్వమే కారణమని విరుచుకుపడ్డారు. తెలంగాణలో టీడీపీతో పొత్తుపెట్టుకొని కొంప ముంచారని విమర్శలు గుప్పించారు. నల్గొండలో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి కుంతియాపై మండిపడ్డారు.

తెలంగాణలో టీడీపీతో పొత్తు కొంప ముంచింది. చంద్రబాబుతో చేతులు కలపవడం వల్ల కాంగ్రెస్ పార్టీని చేజేతులా నాశనం చేసుకున్నాం. ఎన్నికల్లో ఓటమికి రాష్ట్ర నాయకత్వమే కారణం. ఉత్తమ్, కుంతియా వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అయింది. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి వెళ్లే రాష్ట్ర నాయకత్వం స్పందించలేదు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం. నేతలంతా బీజేపీ వైపే చూస్తున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


కోమటిరెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు ఫిక్సయ్యారని..అందుకే ఈ వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం జరుగుతోంది. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 4 ఎంపీ సీట్లు గెలవడం బీజేపీకి బిగ్ బూస్ట్ ఇచ్చింది. ఇదే ఊపుతో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని అమిత్ షా దృష్టిసారించారు. పలు పార్టీలకు చెందిన కీలక నేతలను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారాయి.
First published: June 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...