రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర అసహనం

రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: March 14, 2020, 5:34 PM IST
రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర అసహనం
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు రాజకీయంగా కొత్త సవాల్ విసిరారనే చెప్పాలి. మరి.. తనదైన వ్యహాలతో ప్రత్యర్థులకు చెక్ పెట్టే కేసీఆర్.. రేవంత్ రెడ్డి తాజా ఎత్తుగడను ఏ రకంగా తిప్పుకొడతారన్నది ఆసక్తికరంగా మారింది.
  • Share this:
టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.... రేవంత్ రెడ్డి మెచ్యూరిటీ పొలిటీషియన్‌గా ప్రవర్తించాలని సూచించారు. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడమేంటని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్న పిల్లల చేష్టల లాగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని వ్యాఖ్యానించారు. కారెక్కి షో చేసి... హీరో అనుకుంటే ఎలా ? అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. గోపనపల్లి భూ స్కాం బయటపడగానే జీవో 111 గుర్తొచ్చిందా ? అని ప్రశ్నించారు.

జీవో 111పై ఇప్పటిదాకా ఏం చేశారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎవరు ఫామ్ హౌస్‌లు కట్టుకుంటే ఏంటని... టీ షర్ట్ వేసుకుని ఛలో ప్రగతి భవన్ అనడమేంటని ప్రశ్నించారు. ఒంటరిగా తప్పించుకుని పిల్లాడిలా బైక్‌పై వెళ్లడమూ బాగా లేదు. ఛలో కార్యక్రమం అంటే లక్ష మందితో చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: March 14, 2020, 5:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading