అలా చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ బాగుపడుతుంది..కోమటిరెడ్డి వ్యాఖ్య

పార్టీ పదవులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా రాజీనామా చేస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: September 9, 2019, 3:38 PM IST
అలా చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ బాగుపడుతుంది..కోమటిరెడ్డి వ్యాఖ్య
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పదవులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా రాజీనామా చేస్తేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆయన దాటవేత ధోరణితో వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారినంత మాత్రాన కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారే పరిస్థితి లేదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అయితే తను పార్టీ మారడంలేదని కోమటిరెడ్డి సూటిగా చెప్పకపోవడం విశేషం. తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ పుంజుకుంటోందని ఆయన పునరుద్ఘాటించారు.

పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తీసుకుంటారా? అన్న ప్రశ్నపై స్పందిస్తూ...చేతులు కాలాక పీసీసీ పదవులు ఎందుకన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి వద్దని రాహుల్ గాంధీయే రాజీనామా చేశాక, ఇక ఎవరేం చేయగలరని ప్రశ్నించారు. పీసీసీ నేతలు తెలంగాణలో పాదయాత్రలు చేస్తే ప్రయోజనం ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. పాదయాత్ర కాదు...మోకాళ్ల యాత్ర చేసినా కేసీఆర్ వినే పరిస్థితి లేదన్నారు. అదే సమయంలో రైతుల కోసం తన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్ర చేస్తే మంచిదేనని అభిప్రాయపడ్డారు. తనకు మునుగోడ నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమని వ్యాఖ్యానించారు.
First published: September 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading