కోలీవుడ్ హీరోకు బిగ్ షాక్... పార్టీ ‘ప్రాంతీయ’ హోదా రద్దు ?

విజయ్‌కాంత్ సారథ్యంలోని డీఎండీకే ప్రాంతీయ పార్టీ హోదాను కోల్పోనుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీ కూటమితో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన డీఎండీకే... దారుణ ఓటమిని చవిచూసింది.

news18-telugu
Updated: June 3, 2019, 3:09 PM IST
కోలీవుడ్ హీరోకు బిగ్ షాక్... పార్టీ ‘ప్రాంతీయ’ హోదా రద్దు ?
డీఎండీకె చీఫ్ విజయ్‌కాంత్(File)
  • Share this:
ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కోలీవుడ్ సీనియర్ హీరో విజయ్‌కాంత్‌కు మరో షాక్ తగిలింది. ఆయన సారథ్యంలోని డీఎండీకే ప్రాంతీయ పార్టీ హోదాను కోల్పోనుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీ కూటమితో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన డీఎండీకే... దారుణ ఓటమిని చవిచూసింది. నిబంధనల ప్రకారం కనీసం 6 శాతం ఓట్లను పొందడంలో డీఎండీకే విఫలమైంది. దీంతో ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ హోదాను రద్దు చేసే ప్రక్రియను మొదలుపెట్టినట్టు కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన డీఎండీకే అభ్యర్థులకు కేవలం 2.19 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కనీసం ఒక ఎంపీ స్థానంలో విజయం సాధించినా డీఎండీకే ప్రాంతీయ పార్టీ గుర్తింపు కొనసాగేది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి 3 శాతం ఓట్లు రాకపోవడం, ఈ లోక్ సభ ఎన్నికల్లో విఫలం కావడంతోనే గుర్తింపును రద్దు చేయనున్నట్టు ఈసీ పేర్కొంది.

2005లో డీఎండీకేను స్థాపించిన హీరో విజయ్‌కాంత్... 2006 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీకి 8.38 శాతం ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికల్లో 10.8 శాతం ఓట్లను దక్కించుకున్న డీఎంకే 2011 ఎన్నికల్లో 7.88 శాతం ఓట్లను దక్కించుకుంది. అయితే 2016లో జరిగిన తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2.39 శాతం ఓట్లను మాత్రమే కైవసం చేసుకున్న డీఎండీకే... 2019 లోక్ సభ ఎన్నికల్లో 2.19 శాతం ఓట్లను దక్కించుకుని ప్రాంతీయ పార్టీ హోదాను కోల్పోయే ప్రమాదంలో పడిపోయింది.

First published: June 3, 2019, 3:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading