• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • KOLLU RAVINDRA MURDER ATTEMPT ON MINISTER PERNI NANI POLICE TO INTERROGATE TDP LEADER KOLLU RAVINDRA SK

Kollu Ravindra: మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసు.. టీడీపీ నేత ఇంటి వద్ద టెన్షన్.. టెన్షన్..

పేర్ని నాని, కొల్లు రవీంద్ర

Perni Nani- Kollu Ravindra: మోకా భాస్కరావు కేసులో ఇప్పటికే నెల రోజుల పాటు జైల్లో ఉన్న రవీంద్ర.. ఇప్పుడు పేర్నినానిపై హత్యాయత్నం కేసులోనూ ఆరోపణలు ఎదుర్కోవడం హాట్ టాపిక్‌గా మారింది.

  • Share this:
    ఏపీ రవాణా, సమాచారమంత్రిత్వశాఖ మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఆయనపై దాడికి యత్నించిన నాగేశ్వరరావు టీడీపీకి చెందిన వ్యక్తి వైసీపీ ఆరోపిస్తోంది. ఐతే వైసీపీ దిగుజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి పోలీసులు వెళ్లారు. విచారణ నిమిత్తం ఆయన్ను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి టీడీపీ కార్యకర్తలు, కొల్లు రవీంద్ అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తన వ్యాఖ్యలపై ఇప్పటికే లిఖితపూర్వకంగా నమోదు చేసుకున్నారని, అయినా స్టేషన్‌కు ఎందుకు రావాలని కొల్లు రవీంద్ర పోలీసులను ప్రశ్నించారు. మరోవైపు ఆయన్ను పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొల్లు రవీంద్ర ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.

    నవంబరు 29న మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. మంత్రి తన ఇంట్లో ఉండగానే నాగేశ్వరరావు అనే భవన నిర్మాణ కార్మికుడు తాపీతో ఆయనపై దాడి చేయబోయాడు. అంతలోనే అప్రమత్తమైన అనుచరులు అతడిని పట్టుకొని నిలువరించారు. మంత్రిపై దాడి చేసేందుకు అతడు రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. మంత్రి కాళ్ల మీద పడుతున్నట్లు నటించి.. దాడికి యత్నించాడు. మంత్రి అనుచరులు అప్రమత్తమవడంతో పేర్ని నాని తృటిలో తప్పించుకున్నారు. అనంతరం తాపీ మేస్త్రి నాగేశ్వరరావును పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    vijayawada, perni nani, attack on minister, ap news, attack on perni nani, telugu news, telugu varthalu, పేర్ని నానిపై దాడి, మంత్రిపై దాడి, వైరల్ న్యూస్, ఏపీ న్యూస్, విజయవాడ న్యూస్,
    పేర్ని నాని


    మంత్రి పేర్నినాని తల్లి ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె పెద్ద కర్మ కార్యక్రమాన్ని మచిలీపట్నంలోని మంత్రి నివాసంలో ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పెద్దకర్మ కార్యక్రమాల అనంతరం.. అందరూ భోజనాలకు బయలుదేరారు. మంత్రి పేర్ని నాని.. తన అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడేందుకు గేట్ వద్దకు వచ్చారు. అదే సమయంలో నాగేశ్వరరావు మంత్రి వద్దకు వచ్చి, కాళ్లు మొక్కుతున్నట్లు నటించాడు. తాపీతో ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. అతడిని వెనక్కి లాగారు. ఐతే నిందితుడు టీడీపీకి చెందిన వ్యక్తి అని వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.



    మరోవైపు జూన్ 29న మంత్రి పేర్నినాని అనుచరుడు, వైసీపీ నేత మోకా భాస్కరరావు మచిలీపట్నంలో దారుణ హత్యకు గురయ్యారు. మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ఏ4 నిందితుడిగా ఉన్నారు. జులై 3న ఆయన్ను తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతాపురం వద్ద అరెస్ట్ చేశారు. అనంతరం నెల రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో గడిపారు. ఆగస్టు 24న ఆయనకు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.... ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ఐతే మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసులో ఆయన్ను విచారిచేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మోకా భాస్కరావు కేసులో ఇప్పటికే నెల రోజుల పాటు జైల్లో ఉన్న రవీంద్ర.. ఇప్పుడు పేర్నినానిపై హత్యాయత్నం కేసులోనూ ఆరోపణలు ఎదుర్కోవడం హాట్ టాపిక్‌గా మారింది.
    Published by:Shiva Kumar Addula
    First published: