అచ్చెన్నాయుడు తర్వాత కొల్లు రవీంద్ర విషయంలో టీడీపీకి షాక్..

వైసీపీ నేత భాస్కర్ రావు హత్య కేసులో నిందితుడు అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్‌ను జిల్లా కోర్టు కొట్టేసింది.


Updated: July 30, 2020, 3:04 PM IST
అచ్చెన్నాయుడు తర్వాత కొల్లు రవీంద్ర విషయంలో టీడీపీకి షాక్..
కొల్లు రవీంద్ర (File)
  • Share this:
వైసీపీ నేత భాస్కర్ రావు హత్య కేసులో నిందితుడు అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్‌ను జిల్లా కోర్టు కొట్టేసింది. మచిలీపట్నంలో కొన్ని రోజుల క్రితం వైసీపీ నేత హత్య జరిగింది. ఆ కేసులో కొల్లు రవీంద్ర ఏ4 గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం ఉందంటూ భాస్కర్ రావు కుటుంబసభ్యులు ఆరోపించారు. మచిలీపట్నంలో పోలీస్ స్టేషన్ ఎదుట భాస్కర్ రావు వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందంటూ భాస్కర్ రావు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు నేపథ్యంలో కొల్లు రవీంద్ర ఇంటిని పోలీసులు సోదా చేశారు. కొల్లు రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనంతరం ఆయన్ను తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ వెళ్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచడంతో న్యాయస్థానం రవీంద్రను రిమాండ్‌కు పంపింది. ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కొల్లు రవీంద్ర జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని న్యాయస్థానం కొట్టివేసింది.

మరోవైపు ఈఎస్ఐ స్కాంలో మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌ను ఈనెల 29న ఏపీ హైకోర్టు  కొట్టేసింది. అచ్చెన్నాయుడితో పాటు రమేశ్ కుమార్, పితాని సత్యనారాయణ పీఏ మురళి, సుబ్బారావు బెయిల్ పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. కేసుకు సంబంధించి ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు... ఏసీబీ వాదనతో ఏకీభవించింది. ఈ కేసుకు సంబంధించిన ఇంకా అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందని.. ఒకవేళ నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని హైకోర్టుకు వివరించింది. ఏసీబీ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. అచ్చెన్నాయుడు సహా మరికొందరి బెయిల్ పిటిషన్లను కొట్టేసింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 30, 2020, 2:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading