మంగళగిరి కోర్టులో హాజరైన కోడెల కుమారుడు

కోడెల శివరాం (Image : Facebook)

హైకోర్టు ఆదేశాల మేరకు శివరామ్‌ మంగళగిరి న్యాయస్థానానికి వచ్చారు. తనపై నమోదైన కేసులకు సంబంధించి ఇటీవల ఆయన కోర్టులో లొంగిపోయారు.

  • Share this:
    కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్‌ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. శాసనసభ ఫర్నీచర్‌ వ్యవహారంలో పూచీకత్తు సమర్పించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు శివరామ్‌ మంగళగిరి న్యాయస్థానానికి వచ్చారు. తనపై నమోదైన కేసులకు సంబంధించి ఇటీవల ఆయన కోర్టులో లొంగిపోయారు. శివరాంకు మంగళగిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శుక్రవారం తుళ్లూరు పీఎస్‌కు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

    మరోవైపు కోడెల ఆత్మహత్య కేసు విచారణను బంజారాహిల్స్ పోలీసులు వేగవంతం చేశారు. కోడెల ఫోన్‌తో పాటు శివరాం స్టేట్‌మెంట్ కోసం గుంటూరు వెళ్లనున్నారు. అక్కడే శివరాం స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఇక అంతకు ముందు ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతల్లో ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి.
    First published: