కోడెల ఆత్మహత్య కేసు... విచారణకు కొడుకు, కూతురు డుమ్మా

కోడెల శివ ప్రసాద్(ఫైల్ ఫోటో)

కోడెల ఆత్మహత్య కేసుకు సంబంధించి తమ వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోడెల తనయుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మీలకు గతంలో బంజారాహిల్స్ నోటీసులు జారీ చేశారు.

  • Share this:
    కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు విచారణను తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. కోడెల సెల్ ఫోన్ దొరక్కపోవడంతో... ఈ కేసు విచారణలో జాప్యం జరుగుతోందని వార్తలు వినిపించాయి. కేసుకు సంబంధించి తమ వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోడెల తనయుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మీలకు గతంలో బంజారాహిల్స్ నోటీసులు జారీ చేశారు. ఇందుకు సమాధానం ఇచ్చిన కోడెల కుమారుడు, కూతురు... కొద్ది రోజుల తరువాత విచారణకు హాజరవుతామని తెలిపారు.

    అయితే వీరు విచారణకు హాజరుకాకపోవడంతో... తామే గుంటూరు వెళ్లి వారి వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. హైదరాబాదులోని తన నివాసంలో ఉరి వేసుకుని కోడెల బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆత్మహత్య కేసు విచారణను తెలంగాణ పోలీసులు చేపట్టారు. కుమారుడు, కుమార్తె కారణంగానే కోడెల ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందని రాజకీయవర్గాల్లో ఆరోపణలు వినిపించడంతో... ఈ కేసు విచారణలో వారి వాంగ్మూలం కూడా కీలకం కానుంది. మరోవైపు అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు కేసులో మంగళగిరి కోర్టు కోడెల శివరాంకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

    First published: