కోడెల శివప్రసాదరావు మృతిపై కూతురు విజయలక్ష్మి కామెంట్స్..

కోడెల శివప్రసాదరావు (File)

తన తండ్రి మృతిపై తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. ఒత్తిడిలో ఉండడం వల్లే ఆయన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకు చెప్పారు.

 • Share this:
  ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఆయన గుండె పోటుతో చనిపోయారా? లేదంటే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారా? అన్ని ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో కోడెల మృతిపై ఆయన కూతురు విజయలక్ష్మి పోలీసులకు క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి మృతిపై తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. ఒత్తిడిలో ఉండడం వల్లే ఆయన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకు చెప్పారు.

  మా నాన్న చాలా ఒత్తిడిలో ఉన్నారు. నాన్న ఎటువంటి సూసైడ్ నోట్ రాయలేదు. నాన్న మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు. ఉదయం నాన్న కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్లారు. అరగంట గడిచినా కిందకు రాకపోయేసరికి అనుమానం వచ్చింది. నేను పైకి వెళ్లి చూసే సరికి నాన్న ఉరివేసుకొని కనిపించారు. గన్‌మెన్, డ్రైవర్ సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం.
  విజయలక్ష్మి, కోడెల కూతురు
  సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా వరుస కేసులతో సతమతమవుతున్న కోడెల శివప్రసాదరావు... ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోడెలతో పాటు ఆయన కుటుంబసభ్యులపై వరుస కేసులు నమోదయ్యాయి. ఆయన కుమారుడు, కూతురుపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
  First published: