కోడెల మెడపై వాతలు.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

కోడెల శివప్రసాదరావు(ఫైల్ ఫోటో)

ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక గుండెపోటు కారణంగా మరణించారా అన్నది తేలాల్సి ఉంది.

 • Share this:
  ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ప్రభుత్వం, వైసీపీ నేతలు ఆయన్ను వేధించడం వల్లే చనిపోయారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్పత్రికి వచ్చే నాటికే కోడెల మెడపై వాతలు ఉన్నాయని ఆరోపించారు. ఈ
  క్రమంలో ఆయన ఉరివేసుకొని ఉండొచ్చని డాక్టర్లు భావిస్తున్నారని ఆయన అన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో మరిన్ని విషయాలు తెలిసే అవకాశముందన్నారు సోమిరెడ్డి.

  బసవతారకం ఫౌడర్,ఛైర్మన్‌గా ఉండి అదే ఆస్పత్రిలో కోడెల కన్నుమూశారని.. ఇది దురదృష్టకరం. ఆయన మానసిక ఒత్తిడికి గురయ్యారు. పల్నాడు పులిగా పేరున్న కోడెల పది మందికి ధైర్యం చెప్పి, కాపాడిన వ్యక్తి. ఆయనకు సమస్యలు ఉండొచ్చు. ఈ పరిస్థితికి తీసుకొచ్చేలా ప్రభుత్వం టార్గెట్ చేసి వెంటపడింది. ఏమైనా ఉంటే కేసులుంటే చట్టాలు, కోర్టులు చూసుకుంటాయి. కానీ రాజకీయంగా ఆయన్ను తీవ్రంగా వేధించారు. ఆస్పత్రికి వచ్చేటప్పటికీ ఆయన మెడపై వాతలున్నాయి. ఉరివేసుకున్నట్లు డాక్టర్లు భావిస్తున్నారు. శవపరీక్ష కోసం భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తాం.
  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
  ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. కొంతకాలంగా వరుస కేసులతో సతమతమవుతున్న కోడెల శివప్రసాదరావు... ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే ఆయన గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చేరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక గుండెపోటు కారణంగా మరణించారా అన్నది తేలాల్సి ఉంది.
  Published by:Shiva Kumar Addula
  First published: