కోడెల ఆత్మహత్య... కుటుంబంలో గొడవలే కారణమా ?

కోడెల శివ ప్రసాద్(ఫైల్ ఫోటో)

రెండు రోజుల క్రితం బీజేపీలో చేరేందుకు సైతం కోడెల ప్రయత్నాలు చేశారని... బీజేపీ నేతలు గరికపాటి, కంభంపాటితో చర్చలు జరిపారని వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు హఠాన్మరణానికి కారణాలు ఏమిటనే అంశంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొంతకాలంగా తన చుట్టూ ముసురుకున్న వివాదాల కారణంగా కోడెల శివప్రసాదరావు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ కారణంగానే గుండె నొప్పి కారణంగా ఆయన కొద్దిరోజుల క్రితం ఆస్పత్రిలో కూడా చేరారు. అయితే రాజకీయంగా తనకు బిగ్ డ్యామేజ్ జరిగిందని గమనించిన కోడెల శివప్రసాదరావు... ఈ పరిణామాల నుంచి బయటపడేందుకు ఎంతగానో ప్రయత్నించినట్టు తెలుస్తోంది.

    రెండు రోజుల క్రితం బీజేపీలో చేరేందుకు సైతం ఆయన ప్రయత్నాలు చేశారని... బీజేపీ నేతలు గరికపాటి, కంభంపాటితోనూ కోడెల చర్చలు జరిపారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కోడెలకు కుటుంబసభ్యులతోనూ గొడవలు జరిగాయని తెలుస్తోంది. కుమారుడితో ఆయన తీవ్రంగా గొడవపడ్డారని... ఈ పరిణామాలు కూడా ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమై ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా... టీడీపీ రాజకీయాలతో పాటు గుంటూరు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడటం టీడీపీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
    First published: