కోడెల ఆత్మహత్య... రెండు వారాల కిందటే...

కోడెల శివప్రసాద రావు (ఫేస్‌బుక్ ఫోటో)

ఆత్మహత్యకు పాల్పడిన ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు... కొద్ది రోజుల క్రితం కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది.

  • Share this:
    ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణంతో టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ఆయన ఎలా చనిపోయారనే అంశంపై పోస్టుమార్టం తరువాతే స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలతో కోడెల శివప్రసాదరావు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రెండు వారాల కిందటే ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    అయితే అప్పట్లో కుటుంబసభ్యులు సకాలంలో గుర్తించడంతో కోడెలకు ముప్పు తప్పిందని పలువురు చెబుతున్నారు. ఒకప్పుడు ఎంతో గౌరవంగా పులిలా బతికిన తాను, తలవంపులు తట్టుకోలేకపోతున్నానని కోడెల తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని సన్నిహితుల దగ్గర కోడెల ఆవేదన వ్యక్తం చేశారని... ప్రభుత్వ వేధింపుల గురించే తీవ్ర మానసిక వేదనతో పలువురు అభిప్రాయపడుతున్నారు.
    First published: