కోడెల అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు

మధ్యాహ్నం 1గంట తర్వాత నరసరావుపేట స్వర్గ పూరి శ్మశాన వాటికలో అంతిమ సంస్కారం నిర్వహించనున్నారు.

news18-telugu
Updated: September 18, 2019, 8:32 AM IST
కోడెల అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు
కోడెల శివప్రసాదరావు
  • Share this:
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతదేహానికి ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 1గంట తర్వాత నరసరావుపేట స్వర్గ పూరి శ్మశాన వాటికలో అంతిమ సంస్కారం నిర్వహించనున్నారు. అయితే కోడెలకు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు వద్దంటున్నారు కుటుంభసభ్యులు. టీడీపీ నేతలతో, కార్యకర్తలతోనే కోడెలకు అంత్యక్రియలు జరుపుకుంటామని జరుపుకుంటామని చెబుతున్నారు. కోడెల ఆత్మహత్యకు కారణం వైసీపీ ప్రభుత్వం పెట్టిన వేధింపులే అని అంటున్నారు. ఇవాళ కంటితుడుపు చర్యగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అవసరం లేదని కోడెల కుటుంబసభ్యులు పలువురి వద్ద తమ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

మంగళవారం ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసారావు మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలంటూ సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎస్ ఎల్బీ సుబ్రహ్మణ్యానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.  కోడెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇంట్లో టిఫిన్ చేసి... 10.10కి బెడ్‌రూంకి వెళ్లి ఫ్యాన్‌కి ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నారు. కోడెల మృతికి వైసీపీ వేధింపులే కారణమని ఇటు కుటుంబసభ్యులు అటు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>