కొడుకు చంపాడని ప్రచారమా..? వైసీపీపై నిప్పులు చెరిగిన లోకేష్

కోడెల మృతిపై స్పందించిన లోకేశ్ ట్విటర్ వేదికగా వైసీపీపై నిప్పులు చెరిగారు. ఇది మమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అసత్య ప్రచారాలు చేస్తారా? అని మండిపడ్డారు.

news18-telugu
Updated: September 16, 2019, 8:00 PM IST
కొడుకు చంపాడని ప్రచారమా..? వైసీపీపై నిప్పులు చెరిగిన లోకేష్
కోడెల, లోకేష్
news18-telugu
Updated: September 16, 2019, 8:00 PM IST
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హత్యపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం మానసిక క్షోభ వల్లే కోడెల చనిపోయారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన దొంగచేసి ప్రజలకు ముఖం చూపించలేకే.. ఆయన చనిపోయారని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో కోడెల మృతిపై స్పందించిన లోకేశ్ ట్విటర్ వేదికగా వైసీపీపై నిప్పులు చెరిగారు. ఇది మమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అసత్య ప్రచారాలు చేస్తారా? అని మండిపడ్డారు.

కోడెలగారిది ఆత్మహత్య కాదు. ఇది ముమ్మాటికీ వైకాపా ప్రభుత్వ హత్యే. దాన్ని కప్పిపుచ్చుకోడానికి కుటుంబ కలహాలు అని, కొడుకే కొట్టి చంపారని ప్రచారం చేస్తారా? జగన్ గారూ..! శవాల మీద రాజకీయ లబ్ది కాసులు ఏరుకునే పైశాచిక చేష్టలను వైసీపీ ఎప్పటికీ మానుకోదా? కోడెలగారిని కేసుల పేరుతో వేధించి ఆయన బలవన్మరణానికి కారణమైనందుకు కాస్త కూడా పశ్చాత్తాపం లేకుండా, సిగ్గులేని ప్రచారాలతో రెచ్చిపోతారా? మీరసలు మనుషులేనా? మీకసలు విలువలనేవే లేవా?
నారా లోకేష్
సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా వరుస కేసులతో సతమతమవుతున్న కోడెల శివప్రసాదరావు... ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోడెలతో పాటు ఆయన కుటుంబసభ్యులపై వరుస కేసులు నమోదయ్యాయి. ఆయన కుమారుడు, కూతురుపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...