పరిటాలను భౌతికంగా చంపి.. కోడెలను మానసికంగా చంపారు: దేవినేని

దుర్మార్గపు రాజకీయాలను వైఎస్ జగన్ మానుకోవాలని విమర్శించారు దేవినేని.

news18-telugu
Updated: September 16, 2019, 7:40 PM IST
పరిటాలను భౌతికంగా చంపి.. కోడెలను మానసికంగా చంపారు: దేవినేని
కోడెల శివప్రసాదరావు
news18-telugu
Updated: September 16, 2019, 7:40 PM IST
కోడెల మృతిపై ఏపీలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. వైసీపీ వేధింపుల వల్లే ఆయన చనిపోయారని టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సైతం వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పోలీసులను అడ్డంపెట్టుకొని రాజకీయ కక్ష సాధింపుపునకు పాల్పడ్డారని విమర్శించారు. అప్పుడు పరిటాల రవిని భౌతికంగా చంపి.. ఇప్పుడు కోడెల శివప్రసాదరావును మానసిక క్షోభకు గురిచేసి చంపేశారని ఆరోపించారు. దుర్మార్గపు రాజకీయాలను వైఎస్ జగన్ మానుకోవాలని విమర్శించారు దేవినేని.

ప్రభుత్వ వేధింపుల గురించి కోడెల మాతో చాలా సందర్భాల్లో బాధపడ్డారు. పల్నాడులో కాంగ్రెస్ ఎత్తుగడలు తట్టుకొని నిలబడ్డారు. కుటుంబాన్ని అడ్డంపెట్టుకొని వంద రోజుల్లో ఆయనపై ఎన్నో కేసులు పెట్టారు. వేధింపులకు గురిచేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. పరిటాల రవిని భౌతికంగా చంపితే, ఇప్పుడు కోడెల శివప్రసాదరావును మానసిక క్షోభకు గురిచేసి చంపారు.
దేవినేని ఉమ
ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం కోడెల శివప్రసాదరావు పార్థివదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌‌కు తరలించారు. అక్కడ కోడెల పార్థివదేహానికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణతో పాటు మాజీ మంత్రులు దేవినేని ఉమ, కేఈ కృష్ణమూర్తి, ఫరూక్‌ శ్రద్ధాంజలి ఘటించారు. కోడెల పార్థివదేహాన్ని మంగళవారం గుంటూరుకు తీసుకెళ్తారు. అభిమానులు, ప్రజల సందర్శనార్థం పార్టీలో కార్యాలయంలో ఉంచి.. రేపు లేదా ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...