వైసీపీ దౌర్జన్యాలకు నేనూ బాధితుడ్నే: కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు

అధికారం వచ్చి నెలలు గడవకముందే రాష్ట్రంలో టీడీపీ నాయకుల పై 400 కేసులు పెట్టారని కోడెల ఆరోపించారు.

 • Share this:
  గుంటూరు జిల్లా, నరసరావుపేటలో టీడీపీ సీనియర్ నేత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ..వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అధికారం వచ్చి నెలలు గడవకముందే రాష్ట్రంలో టీడీపీ నాయకుల పై 400 కేసులు పెట్టారని ఆరోపించారు. వైసీపీ వాళ్లే కొట్టడం , వైసీపీ వాళ్లే కేసులు పెడుతున్నారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు క్రైమ్ రేట్ జీరోగా ఉందన్నారు. .
  ప్రస్తుత ప్రభుత్వంలో పెట్టుబడిదారులకి అనువైన వాతావరణం లేదన్నారు. పక్క రాష్ట్రాలకి పెట్టుబడి దారులు తరలిపోతున్నారన్నారు. వైసీపీ దౌర్జన్యాలకు తాను కూడా ఒక బాధితుడినే అన్నారు కోడెల. గత రాజకీయ చరిత్రలో ఎన్నో శాఖలలో మంత్రిగా చేసిన తనకు పోలీసులు రూల్స్ చెప్పడం విడ్డురమన్నారు

  మా ఇంటి ముందు ధర్నా చేసిన వ్యక్తి గత చరిత్ర తెలుసుకోవాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితోనే కొన్ని అనైతిక శక్తులు మాపై తప్పుడు కేసులు పెట్టడం జరిగిందన్నారు కోడెల.
  వైసీపీ ముసుగులో కొన్ని అసాంఘిక శక్తులు దాడులు చేస్తారని సామాన్య ప్రజలకు భయంగా ఉంద్నారు. మరోవైపు ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బడ్జెట్‌పై కూడా స్పందించారు కోడెల. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో చాలా ముఖ్య అంశాలు లేవన్నారు. రాష్ట్రం 43 వేళ కోట్ల రెవెన్యూ లోటు ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి 23మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చులకనగా అవహేళనగా  మాట్లాడటం ఒక ముఖ్యమంత్రికి తగదన్నారు.
  Published by:Sulthana Begum Shaik
  First published: