కోడెలను కొడుకే హత్య చేశాడు... బావమరిది సంచలన ఆరోపణలు

కోడెల మరణంపై ఆయన బంధువు కంచేటి సాయి సంచలన ఆరోపణలు చేశారు.

news18-telugu
Updated: September 16, 2019, 4:45 PM IST
కోడెలను కొడుకే హత్య చేశాడు... బావమరిది సంచలన ఆరోపణలు
కోడెల శివప్రసాదరావు
news18-telugu
Updated: September 16, 2019, 4:45 PM IST
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే ఆయన మరణంపై ఆయన బావమరిది కంచేటి సాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెలను ఆయన కుమారుడు శివరాం హత్య చేశాడని కంచేటి సాయి ఆరోపించారు. ఈ మేరకు సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం కోడెలను ఆయన కుమారుడు శివరాం హత్య చేశాడని వ్యాఖ్యానించారు. కోడెలను హత్య చేసిన ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని కంచేటి సాయి ఆరోపించారు. తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కోడెల తనకు ఫోన్ చేసేవారని కంచేటి సాయి అన్నారు.

ఇదే విషయమై తనను పలుసార్లు తన దగ్గరకు కోడెల పిలిపించుకున్నారని పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తండ్రిని ఇబ్బంది పెట్టవద్దని తాను కూడా పలుసార్లు శివరామ్‌కు సూచించానని అన్నారు. తనని కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించానని... అయితే అది కుదరలేదని వివరించారు. కోడెలకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కోడెల మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు.


First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...