• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • KODELA SIVA PRASAD RAO DEATH CHANDRABABU NAIDU COMMENTS ON KODELA DEATH SK

కోడెల శివప్రసాదరావు మృతిపై చంద్రబాబు కామెంట్స్..

కోడెల శివప్రసాదరావు మృతిపై చంద్రబాబు కామెంట్స్..

కోడెల, చంద్రబాబు

క్యాన్సర్ ఆస్పత్రి స్థాపించడంలో కోడెల చొరవ మరవలేనిదని కొనియాడారు. ఇప్పుడు అదే హాస్పిటల్‌లో ఆయన చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు అన్నారు.

  • Share this:
    వైసీపీ రాజకీయ వేధింపులతోనే కోడెల శివప్రసాద్ చనిపోయారని మాజీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. అన్ని సంక్షోభాలను కోడెల ధైర్యంగా ఎదుర్కొన్నారని.. కానీ వైసీపీ అవమానాలను తట్టుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. డాక్టర్‌గా పనిచేసిన వ్యక్తి ఫ్యాన్‌కి ఉరేసుకొని చనిపోవడం ఊహించని పరిణామమన్నారు చంద్రబాబు. ఎంతో క్షోభ అనుభవిస్తే తప్ప.. ఇలా ఆత్మహత్య చేసుకోలేరని ఆయన అన్నారు. దీనిపై ప్రజలందరూ ఆలోచన చేయాలని సూచించారు మాజీ సీఎం.

    కోడెల మరణ వార్తను బాలకృష్ణ ఫోన్ చేసి చెప్పారు. అది విని దిగ్భ్రాంతికి గురయ్యా. తలచుకుంటేనే చాలా బాధ కలుగుతోంది. పేద వారికి డాక్టరైన కోడెల ఎన్టీఆర్ పిలుపుతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. పల్నాడు పులిగా ఆయన బతికాడు. ఎప్పుడూ భయం ఎరుగని వ్యక్తి. గత మూడు నెలలుగా ఆయన్ను వేధిస్తున్నారు. ఆ వేధింపులను భరించలేక కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. అవమానాన్ని భరించలేకే చనిపోయారు. వైసీపీ వేధింపుల వల్ల నిద్ర కూడా పట్టడం లేదని నాతో చాలాసార్లు చెప్పారు. ధైర్యంగా ఉండాలని నేను చెప్పాను. కానీ అంతలోనే ఇది జరిగింది.
    చంద్రబాబు


    పార్టీ కోసం కోడెల శివప్రసాద్ రాత్రింబవళ్లు పనిచేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు చంద్రబాబు. క్యాన్సర్ ఆస్పత్రి స్థాపించడంలో కోడెల చొరవ మరవలేనిదని కొనియాడారు. ఇప్పుడు అదే హాస్పిటల్‌లో ఆయన చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు అన్నారు.

    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు