కక్షసాధింపులకు దిగుతున్నారు... రాజకీయాల్లో ఇది మంచిది కాదన్న కోడెల...

Andhra Pradesh : కే టాక్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడెల శివప్రసాద్... ఏపీ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఇది మంచి పరిణామం కాదన్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 17, 2019, 2:13 PM IST
కక్షసాధింపులకు దిగుతున్నారు... రాజకీయాల్లో ఇది మంచిది కాదన్న కోడెల...
కోడెల శివ ప్రసాద్(ఫైల్ ఫోటో)
  • Share this:
కే టాక్స్ పేరుతో అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్... ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తనపై ఉన్న కేసులపై ప్రభుత్వం సిట్‌తో దర్యాప్తు జరిపిస్తే, దానికి తాము సిద్ధంగా ఉన్నామన్న ఆయన... తన పరువు తీసేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక హోదా, పోలవర్ ప్రాజెక్టు నిర్మాణం, కరవు పరిస్థితులపై దృష్టి పెడితే బాగుంటుందన్న ఆయన... కక్ష సాధింపు చర్యలు కరెక్టు కాదన్నారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతోనే తమపై కేసులు వేస్తున్నారని ఆరోపించిన కోడెల... అవాస్తవాల్ని తమపై రుద్ది, వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఇది మంచి పరిణామం కాదన్న ఆయన... టీడీపీ కార్యకర్తల్ని వేధించి, కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో పాలన జరగాలన్నారు.

రంజీ క్రికెటర్ నాగరాజుకు రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం చేశారన్న ఆరోపణలపై కోడెల శివప్రసాద్, ఆయన కొడుకు కోడెల శివరాంలపై కేసు నమోదైంది. తనకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ.15 లక్షలు తీసుకుని మోసం చేశారని నాగరాజు తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఆరోపణలతో నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
First published: June 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading