వ‌రంగ‌ల్ వెస్ట్ నుంచి కోదండ‌రాం పోటీ ?

కేసీఆర్‌ను రాజ‌కీయంగానే ఎదుర్కోవాల‌ని నిర్ణ‌యించి రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేసిన ప్రొఫెస‌ర్ కోదండ‌రాం... వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్‌లోని వెస్ట్ స్థానం నుంచి బ‌రిలోకి దిగుతార‌ని ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.

news18-telugu
Updated: September 12, 2018, 6:13 PM IST
వ‌రంగ‌ల్ వెస్ట్ నుంచి కోదండ‌రాం పోటీ ?
కోదండ‌రాం( ఫేస్ బుక్ ఫోటో)
news18-telugu
Updated: September 12, 2018, 6:13 PM IST
తెలంగాణ జ‌న‌స‌మితి(టీజేఎస్‌) పార్టీని స్థాపించి పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన ప్రొఫెస‌ర్ కోదండరాం... త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌బోతున్నారు. అయితే ఆయ‌న ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే అంశంపై చాలాకాలం నుంచి ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త‌న సొంత ప్రాంత‌మైన మంచిర్యాల నుంచే ఆయ‌న పోటీ చేస్తార‌ని కొంద‌రంటే... జ‌న‌గాం నుంచి ఆయ‌న బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంద‌ని మ‌రికొంద‌రు భావించారు. ఈ జాబితాలో హైద‌రాబాద్‌లోని ఉప్పల్ పేరు కూడా వినిపించింది. అయితే తాజాగా కోదండరాం వ‌రంగ‌ల్ వెస్ట్ సీటు నుంచి పోటీ చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయని టీజేఎస్ పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

తెలంగాణ ఉద్య‌మంలో వరంగ‌ల్ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం పాత్ర ఎంతో కీల‌క‌మైన‌ది. ఇక్క‌డే కాక‌తీయ యూనివ‌ర్సిటీ ఉంది. కాక‌తీయ యూనివ‌ర్సిటీ కేంద్రంగా జ‌రిగిన అనేక ఉద్య‌మాల్లో పాల్గొన్న కోదండ‌రాంకు ఇక్క‌డి విద్యార్థులు, స్థానికుల‌తో మంచి అనుబంధం ఉంది. ఇక వ‌రంగ‌ల్ కాలేజీలో చ‌దివిన వ్య‌క్తిగా ఆయ‌న‌కు ఇక్క‌డి ప్రాంతంపై అవ‌గాహ‌న కూడా ఉంది.


తెలంగాణ వెస్ట్ ఓట‌ర్ల‌లో అత్య‌ధికులు అక్ష‌రాస్యులే కావ‌డంతో... ఇక్క‌డి నుంచి పోటీ చేయ‌డం ద్వారా త‌న గెలుపు సులువవుతుందని ఆయ‌న భావిస్తున్నార‌ని స‌మాచారం. టీజేఎస్ కోర్ క‌మిటీ సైతం కోదండ‌రాం వ‌రంగ‌ల్ ఈస్ట్ నుంచి పోటీ చేయాల‌ని కోరుతున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే కోదండ‌రాం పార్టీ మ‌హాకూట‌మిలో చేరితే... ఆయ‌న ఎక్క‌డి నుంచి పోటీ చేయాల‌నే అంశం ఇత‌ర పార్టీల సీట్ల స‌ర్దుబాటుపై ఆధారపడి ఉంటుంద‌నే వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...