హుజూర్ నగర్ బరిలో కోదండరామ్... కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా..?

Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనగామ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకుని చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన కోదండరామ్... ఈసారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... కచ్చితంగా గెలవాలనే కృతనిశ్చయంతో ఉన్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 11, 2019, 1:28 PM IST
హుజూర్ నగర్ బరిలో కోదండరామ్... కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా..?
కోదండరామ్
  • Share this:
హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ బరిలోకి దిగబోతున్నట్లు ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నిజ్జన రమేష్ ముదిరాజ్ తెలిపారు. ఇందుకు సంబంధించి హుజూర్ నగర్‌లో త్వరలో భారీ బహిరంగ సభ ఉండబోతోందని ఆయన వివరించారు. హుజూర్‌ నగర్ ఎమ్మెల్యేగా ఉంటూ నల్లగొండ ఎంపీగా విజయం సాధించారు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ కుమార్ రెడ్డి. దాంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. హుజూర్ నగర్ స్థానానికి ఉప ఎన్నిక కూడా ఖాయమైంది. ఉత్తమ్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం లాంఛనమే కావడంతో... ఈ సీటులో ఎవరు గెలుస్తారనే అంశంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.

ఉత్తమ్ భార్య, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి అక్కడి నుంచీ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నా... కోదండరాం బరిలో దిగితే... కాంగ్రెస్ ఆయనకు మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే కోదండరాంకి లెఫ్ట్ పార్టీలతోపాటూ... ఉద్యమ సంఘాలు మద్దతుగా నిలిచే అవకాశాలు ఎక్కువ. అదీకాక... ఇప్పటికే తెలంగాణలో చతికిలపడిన కాంగ్రెస్... ఇప్పుడు హుజూర్ నగర్ స్థానాన్ని గెలుచుకున్నా... దాని వల్ల పెద్దగా ప్రయోజనం పొందేది ఏమీ లేదు. అసలు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే ఆ పార్టీకి అతి పెద్ద సమస్యగా, సవాలుగా మారింది. అందువల్ల హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కి ప్రాధాన్య అంశంగా కనిపించట్లేదు.

హుజూర్ నగర్ నుంచీ కోదండరాం బరిలో దిగుతున్నప్పటికీ... అదే సీటుకి... టీఆర్ఎస్ తరపున కేసీఆర్ కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనగామ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకుని చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన కోదండరామ్... ఈసారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... కచ్చితంగా గెలవాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. నిజంగా కవిత పోటీ చేస్తే, ఆమెను ఓడించే ఉద్దేశంతోనైనా కాంగ్రెస్... కోదండరామ్‌కి మద్దతిచ్చి... ఆయన తరపున ప్రచారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

 ఇవి కూడా చదవండి :

ఏపీ కేబినెట్ కూర్పు నచ్చలేదా..? పార్టీలో అసంతృప్తి ఉందన్న మేకపాటి...

12న లేదా 15న తెలంగాణ కేబినెట్ సమావేశం... ఏం చర్చిస్తారంటే...కాస్త నవ్వండన్నా... మంత్రులతో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు...
First published: June 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>