టీజేఎస్‌కు 8 సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్... 17 సీట్లు కావాలన్న కోదండరాం

మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంశంపై అంతర్గతంగా చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ పార్టీ... కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్ పార్టీకి 8 సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే తనకు 17 సీట్లుకు తక్కువ కాకుండా ఇవ్వాలని కోదండరాం కాంగ్రెస్ పార్టీకి స్పష్టం చేసినట్టు సమాచారం.

news18-telugu
Updated: October 12, 2018, 6:46 PM IST
టీజేఎస్‌కు 8 సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్... 17 సీట్లు కావాలన్న కోదండరాం
కోదండ‌రాం ( ఫేస్‌బుక్ ఫోటో)
  • Share this:
కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్(తెలంగాణ జనసమితి)కు సీట్ల కేటాయింపు అంశంపై కాంగ్రెస్ పార్టీ చర్చలు మొదలుపెట్టింది. టీడీపీ, సీపీఐలకు కేటాయించే సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చినట్టు వార్తలు వినిపించాయి. అయితే తనకు కాంగ్రెస్ ఆఫర్ చేస్తున్న సీట్ల కంటే ఎక్కువ స్థానాలు కావాలని కోదండరాం పట్టుబడుతుండటంతో... కాంగ్రెస్, టీజేఎస్ మధ్య సీట్ల పంపిణీ విషయంలో సంగ్దిగ్ధత నెలకొంది.

మొదట కోదండరాం పార్టీకి 3 సీట్లు ఇవ్వాలని భావించిన కాంగ్రెస్, ఆ తరువాత టీజేఎస్‌కు 5 సీట్లు ఇవ్వాలని అనుకుంటున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే టికెట్ల అంశంపై త్వరగా తేల్చాలని కోదండరాం కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం ఇవ్వడంతో... ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా దృష్టి సారించారు. టీజేఎస్‌కు 8 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉందని కాంగ్రెస్ నేతలు కోదండరాంకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించిన కోదండరాం... తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలన్నింటి పరిధిలో తనకు ఒక్కో సీటు ఇవ్వాలని కోదండరాం కాంగ్రెస్ నేతలకు చెప్పినట్టు సమాచారం. ఈ అంశంపై కోర్ కమిటీలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు కోదండరాంకు చెప్పినట్టు టాక్. మొత్తానికి కోదండరాం పట్టుదల కారణంగా మహాకూటమిలో భాగమైన టీజేఎస్‌కు పదికిపైగానే సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: October 12, 2018, 6:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading