కేజ్రీవాల్‌ మోడల్‌పై కన్నేసిన కోదండరామ్

తెలంగాణలో ఇప్పటివరకు టీఆర్ఎస్‌ను రాజకీయంగా టార్గెట్ చేసుకుంటూ ముందుకు సాగిన కోదండరామ్... ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు.

news18-telugu
Updated: February 19, 2020, 1:57 PM IST
కేజ్రీవాల్‌ మోడల్‌పై కన్నేసిన కోదండరామ్
కోదండరామ్, కేజ్రీవాల్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావించి భంగపడ్డ టీజేఏసీ మాజీ చైర్మన్, టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్... రాజకీయంగా కొత్త ఎత్తులు వేసేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న కోదండరామ్... తెలంగాణలో టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసేందుకు నయా వ్యూహాన్ని రచించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఢిల్లీలో సామాన్యుడిగా రాజకీయాల్లోకి వచ్చి అసామాన్యుడిలా మారిన కేజ్రీవాల్ బాటలో పయనించాలని కోదండరామ్ భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో ఇప్పటివరకు టీఆర్ఎస్‌ను రాజకీయంగా టార్గెట్ చేసుకుంటూ ముందుకు సాగిన కోదండరామ్... ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. అయితే తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమీ చేస్తామో చెప్పి జనంలోకి వెళ్లాలని... ఇందుకోసం ఢిల్లీలోని కేజ్రీవాల్ మోడల్ సరైందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆయన తన పార్టీ కేడర్‌కు క్లాసులు కూడా తీసుకుంటున్నారని సమాచారం.

అయితే పార్టీ నిర్మాణం లేకుండా ఈ రకమైన ప్రయోగాలు అంతగా ఫలితాలు ఇవ్వవని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఢిల్లీలో మరోసారి ప్రజల మనసు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ మోడల్ కోదండరామ్‌కు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.





First published: February 19, 2020, 1:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading