టీఆర్ఎస్ పాలనలో ఎవరికీ న్యాయం జరగడం లేదు: కోదండరాం

తెలంగాణలో మార్పు రావాలంటే టీజేఎస్‌ను ఆదరించాలని ప్రజలను కోరారు కోదండరాం. టీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.

news18-telugu
Updated: September 30, 2018, 9:23 PM IST
టీఆర్ఎస్ పాలనలో ఎవరికీ న్యాయం జరగడం లేదు: కోదండరాం
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం(Image: Facebook)
  • Share this:
పాలమూరు నుంచే టీజేఎస్(తెలంగాణ జనసమితి పోరాటం) మొదలైందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. అందరూ కలిసి పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎవరికీ న్యాయం జరగడం లేదని ఆయన ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టులతో కాంట్రాక్టర్ల జేబులు నిండుతున్నాయని కోదండరాం విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో కాంట్రాక్టర్లను రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారని ఆరోపణలు గుప్పించారు.

మహబూబ్‌నగర్ జిల్లాను ఇష్టం వచ్చినట్టుగా ముక్కలు చెక్కలు చేశారని కోదండరాం వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథలో ఎంతో అవినీతి జరుగుతోందని... దాన్ని ఆపితే పేదలకు ఇళ్లు, ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారి ఆకాంక్షలు, ఆశయాలు నెరవేరాలలంటే టీజేఎస్‌ను ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ పరిపాలనలో మార్పు తీసుకురావడానికే తెలంగాణ జనసమితి ఏర్పాటైందని అన్నారు.
Published by: Kishore Akkaladevi
First published: September 30, 2018, 9:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading