టీఆర్ఎస్ గెలిస్తే జరిగేది అదే: కోదండరామ్

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కోదండరామ్ ఆరోపించారు.

news18-telugu
Updated: October 17, 2019, 5:20 PM IST
టీఆర్ఎస్ గెలిస్తే జరిగేది అదే: కోదండరామ్
కోదండరాం(ఫైల్ ఫోటో)
  • Share this:
హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలిస్తే... ఇక కేసీఆర్ ఎవరి మాట వినరని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. నియోజకవర్గంలోని ఎల్లపురంలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోదండరామ్... హుజూర్‌నగర్‌లో పద్మావతి గెలుపు ఎంతో అవసరమని అన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. డబ్బు తీసుకుని ఓట్లు వేస్తే... ఆ తరువాత గెలిచిన వ్యక్తి ఎవరినీ పట్టించుకోరని అన్నారు. హుజూర్ నగర్‌లో గెలిస్తే... సీఎం కేసీఆర్ ఎవరినీ పట్టించుకోరని అన్నారు.

ఇక్కడ గెలిస్తే ఆర్టీసీ సమ్మెను, కార్మికుల సమస్యలపై కూడా స్పందించరని కోదండరామ్ ఆరోపించారు. ఈ ఒక్క సీటు గెలవడం వల్ల టీఆర్ఎస్‌కు వచ్చే లాభం ఏమీ లేదని... కానీ కాంగ్రెస్ గెలిస్తే టీఆర్ఎస్‌ను ప్రశ్నించే అవకాశం లభిస్తుందని కోదండరామ్ అన్నారు. టీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయమైపోయిందని కోదండరామ్ ధ్వజమెత్తారు.

First published: October 17, 2019, 5:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading