హోమ్ /వార్తలు /National రాజకీయం /

Telangana: కాంగ్రెస్‌లో టీజేఎస్ విలీనం.. క్లారిటీ ఇచ్చిన కోదండరామ్

Telangana: కాంగ్రెస్‌లో టీజేఎస్ విలీనం.. క్లారిటీ ఇచ్చిన కోదండరామ్

కోదండరామ్ (పైల్ ఫోటో)

కోదండరామ్ (పైల్ ఫోటో)

Kodandaram Comments: రాజకీయంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తామని కోదండరామ్ తెలిపారు.

  కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ జనసమితి విలీనం అవుతుందని వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ స్పందించారు. కాంగ్రెస్‌లో టీజేఎస్ విలీనం కాబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు. తెలంగాణ సమాజంలో టీజేఎస్ పొలిటికల్ పార్టీగా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. వైఎస్ తెలంగాణ గుండె చప్పుడు అంటే తెలంగాణ సమాజం అంగీకరించదని పరోక్షంగా కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిలకు కౌంటర్ ఇచ్చారు. గతంలో తెలంగాణకు వీసా తీసుకుని పోవాలా అన్నది వైఎస్ కాదా ? అని కోదండరామ్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మరింత విస్తృంగా పోరాడతామని ఆయన తెలిపారు. రాజకీయంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తామని కోదండరామ్ తెలిపారు.

  తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కోదండరామ్.. ఆ తరువాత కొన్నాళ్లకు కేసీఆర్‌తో విభేదించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించుకుని తెలంగాణ జన సమితి పేరుతో పార్టీని పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో టీజేఎస్ పొత్తు కూడా పెట్టుకుంది. కానీ పొత్తులో భాగంగా కోదండరామ్ కూడా ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. ఆ తరువాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరామ్.. ఆ ఎన్నికల్లోనూ విజయం సాధించలేకపోయారు.

  దీంతో ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని భావిస్తున్నారని.. ఇందుకోసం కొత్త టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని కోదండరామ్ క్లారిటీ ఇవ్వడంతో.. రాజకీయంగా నిలదొక్కుకునేందుకు ఆయన ఏం చేస్తారన్నది చూడాలి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Kodandaram, Telangana

  ఉత్తమ కథలు