ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ దెబ్బకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మండలి గ్యాలరీ ఎక్కారని సెటైర్లు వేశారు. 40 ఏళ్లు అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, పదేళ్లు ప్రతిపక్ష నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు జగన్ దెబ్బకు మండలి గ్యాలరీ ఎక్కి కూర్చున్నారని ఎద్దేవా చేశారు. నెక్ట్స్ టైమ్ అసెంబ్లీ గ్యాలరీ ఎక్కించాలని సీఎం జగన్‌ను కోరారు కొడాలి నాని. ఆయన వ్యాఖ్యలతో సభలో నవ్వులు విరిశాయి. అంతేకాదు మంత్రులు తాగొచ్చారంటూ యనమల అంటున్నారని.. కానీ చంద్రబాబు, బాలకృష్ణ వచ్చాకే మండలిలో మందు వాసన వచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి.
''గ్యాలరీలో చంద్రబాబు నాలుగు గంటలు కూర్చున్నారు. సిగ్గు లేకుండా అక్కడి నుంచి ఛైర్మన్‌కు డైరెక్షన్స్ ఇచ్చారు. మంత్రులు తాగారు, జర్దాలు నమిలారని యనమల రామకృష్ణుడు ప్రెస్మీట్లో చెప్పారు. మేం అసెంబ్లీ నుంచి మండలికి అటుఇటూ తిరుగుతూనే ఉన్నాం. ఇక్కడ రాని వాసన మండలిలో ఎలా వచ్చింది. మాకు కూడా అనిపించింది. చంద్రబాబు, ఆయన బావమరిది బాలకృష్ణ గ్యాలరీలోకి వచ్చాక మందు వాసన వచ్చింది. చంద్రబాబు తాగొచ్చారో.. లేదంటే టీడీపీకి సంబంధించిన వాళ్లు ఎవరైనా తాగొచ్చారో.. యనమల రామకృష్ణుడు తేల్చాలి. బ్రీత్ అనలైజర్ పెట్టి మందు వాళ్లను పరీక్షించాలి. మాకు అభ్యంతరం లేదు.'' అని కొడాలి నాని అసెంబ్లీలో అన్నారు.
Published by:Shiva Kumar Addula
First published:January 23, 2020, 17:10 IST