Home /News /politics /

KODALI NANI INTERESTING COMMENTS ON NANDAMURI BALAKRISHNA BA

Kodali Nani: బాలయ్యపై కొడాలి నాని ఆసక్తికర కామెంట్స్.. నాకే అలా జరిగితే..

kodali Nani: కొడాలి నాని (File)

kodali Nani: కొడాలి నాని (File)

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణకు ఇటీవల టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అడుగుతున్నారనే ప్రచారం జరుగుతుండడంతో ఈ అంశంపై ఆయన స్పందించారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణకు ఇటీవల టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అడుగుతున్నారనే ప్రచారం జరుగుతుండడంతో ఈ అంశంపై ఆయన స్పందించారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్లు చేశారు. బాలయ్య అడిగితే వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంటి, ఏకంగా ప్రెసిడెంట్ అయినా ఇవ్వొచ్చన్నారు. అది బాలయ్య తండ్రి నందమూరి తారకరామారావు పెట్టిన పార్టీ అని చెప్పారు. ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు వెన్నుపోటు పొడిచి లాక్కుంటే ఆయన వెనుక బాలయ్య తిరుగుతున్నారని విమర్శించారు. బాలయ్య ఆటలో అరటి పండు అని ఆయన చేసే కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

    ఇటీవల హిందూపురంలో పర్యటించిన బాలకృష్ణ హాట్ కామెంట్లు చేశారు. ఏపీ ప్రభుత్వం మీద ఘాటైన విమర్శలు గుప్పించారు. కొడాలి నానికి కూడా పరోక్షంగా హెచ్చరిక ఇచ్చారు. ‘ఇది దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం. టీడీపీ దేవతలు. వైసీపీ రాక్షసులు. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం. పేకాట విషయంలో ఓ తమ్ముడు దొరికితే ఏమంటున్నాడు? ఏముంది రూ.10వేలు కడతాం బయటకు వస్తాం అంటారా?. చట్టం, న్యాయం అంటే లెక్కలేని తనం. నోటిని అదుపులో పెట్టుకో. మేం మాటల మనుషులం కాదు. అవసరమైతే చేతలు చూపిస్తాం.’ అని బాలకృష్ణ హెచ్చరించారు.

    ఇటీవల ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా కొడాలి నాని చంద్రబాబుపై మండిపడ్డారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న అంశం., ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి నాడు, మహానాడు సందర్భంలోనే చంద్రబాబుకు గుర్తుకు వస్తుందని విమర్శించారు. ఎన్టీఆర్ స్క్రీన్ పై నటుడైతే.., చంద్రబాబునాయుడు నిజజీవితంలో పెద్దనటుడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు బ్రతికుండగా ఎన్టీఆర్ కు భారతరత్న రాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం చంద్రబాబు కోసం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవర్నైనా వెన్నుపోటు పొడుస్తారన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న.., చంద్రబాబుకు ప్రపంచరత్న అవార్డు ఇవ్వాలన్నారు కొడాలి నాని. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు ఎన్టీఆర్ ను చూసి చంద్రబాబు కూడా తనను తాను పెద్ద నాయకుడిలా అభివర్ణించుకుంటున్నారన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని అక్రమంగా లాక్కున్న చంద్రబాబు.. తెలంగాణలో పార్టీని భూస్థాపితం చేశారన్నారు. టీడీపీకి తెలంగాణలో 1.29% ఓట్లు రావడానికి చంద్రబాబే కారణమన్నారు. టీడీపీకి ఎన్టీఆర్ వ్యవస్థాపకుడైతే.., చంద్రబాబు, లోకేష్ భూస్థాపితులని ఎద్దేవా చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Bala Krishna Nandamuri, Kodali Nani, Tdp

    తదుపరి వార్తలు