జగన్ పుట్టిన రోజు నాటికి ఆ పని పూర్తి.. చంద్రబాబుపై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు..

చంద్రబాబునాయుడు, కొడాలి నాని

వైఎస్ జగన్ పుట్టిన రోజు డిసెంబర్ 21 నాటికి రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి కొడాలి నాని చెప్పారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు డిసెంబర్ 21 నాటికి రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియను పూర్తి చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. గాంధీ జయంతి లేదా దసరా నాటికి ఇళ్ల పట్టాలు అందజేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రులు, అధికారులను ఆదేశించారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎవరు ఎన్ని రకాలైన అడ్డంకులు సృష్టించినా కూడా తాము అనుకున్నట్టు సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు మీద తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న అతి భయంకరమైన రాక్షసుడు చంద్రబాబు నాయుడు అని మంత్రి కొడాలి నాని కామెంట్స్ చేశారు. లోక కళ్యాణం కోసం రుషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసుడి తరహాలో చంద్రబాబు అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేయాలని సీఎం జగన్ పరితపిస్తున్నారని అన్నారు. జగన్ అమలుచేస్తున్న పథకాలు,ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్దిని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ప్రజల గుండెల్లో జగన్ ఎక్కడ దేవుడై పోతాడోనని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: