వైసీపీలోకి వంశీ వస్తే... ఆ మంత్రులకు అగ్ని పరీక్షే ?

వల్లభనేని వంశీ వైసీపీలో చేరితే... జగన్ పెట్టుకుని సెల్ఫ్ కండీషన్స్ ప్రకారం ఆయన టీడీపీ ద్వారా వచ్చిన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే.


Updated: October 31, 2019, 3:04 PM IST
వైసీపీలోకి వంశీ వస్తే... ఆ మంత్రులకు అగ్ని పరీక్షే ?
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయ పయనం ఎటు అనే అంశంపై మెల్లిమెల్లిగా క్లారిటీ వస్తోంది. ఆయన టీడీపీని వీడటం ఖాయమనే విషయం తేలిపోయింది. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించిన విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సైతం పరోక్షంగా ఇదే విషయాన్ని తేల్చి చెప్పడంతో... ఇక వంశీ అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోవడం మాత్రమే మిగిలిందనే ప్రచారం జరుగుతోంది. వల్లభనేని వంశీ వైసీపీలో చేరితే... జగన్ పెట్టుకుని సెల్ఫ్ కండీషన్స్ ప్రకారం ఆయన టీడీపీ ద్వారా వచ్చిన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే. అలా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి. అలాంటప్పుడు అక్కడ వైసీపీని గెలిపించే బాధ్యత ఎవరు తీసుకుంటారనే అంశంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

అయితే వంశీ రాజీనామా చేసి వైసీపీలో చేరితే... గన్నవరంలో పార్టీని గెలిపించే బాధ్యతను మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని తీసుకోనున్నారని తెలుస్తోంది. గన్నవరంలో ఉప ఎన్నిక జరిగితే మళ్లీ వంశీ పోటీ చేస్తారా లేక మరొకరు పోటీ చేస్తారా ? అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ... అక్కడ వైసీపీని గెలిపించే బాధ్యత మాత్రం కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలదే అనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి గన్నవరంలో ఉప ఎన్నిక వస్తే... కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకే పరీక్షే అని స్పష్టమవుతోంది.
Published by: Kishore Akkaladevi
First published: October 31, 2019, 2:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading