KNIFE FOUND IN HIMACHAL PRADESH APPOINTED GOVERNOR BANDARU DATTATREYAS HOUSE BS
దత్తాత్రేయ ఇంట్లో కత్తి కలకలం.. భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు..
బండారు దత్తాత్రేయ
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు రాంనగర్‌లోని ఇంటికి నేతలు, అభిమానులు తరలి వస్తున్నారు.
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు రాంనగర్‌లోని ఇంటికి నేతలు, అభిమానులు తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయనతో ఫొటోలు దిగేందుకు నేతలు ఉత్సుకత చూపించారు. అదే సమయంలో తోపులాట జరిగింది. హాల్లోనే అక్కడ చిన్నపాటి కత్తి (పెన్సిల్ కట్టర్) కనిపించింది. వెంటనే కార్యకర్తలు దాన్ని దత్తాత్రేయ వ్యక్తిగత సిబ్బందికి అందజేశారు. దీంతో.. దత్తాత్రేయ నివాసంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్తగా నేతలను తనిఖీ చేశాకే లోపలికి పంపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, రెండు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన దత్తాత్రేయ.. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన పోటీ చేసే సికింద్రాబాద్ స్థానం నుంచి కిషన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.