తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మీద షీ టీం పోలీసులు కేసు పెట్టాలని బీజేపీ నేత కిషన్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ ఇప్పటి వరకు కనీసం ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. దీన్ని వివక్షతగా పరిగణించాలన్నారు. మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యత కల్పించకపోవడాన్ని వివక్షతగా పరిగణించి.. కేసీఆర్‌పై షీ టీం పోలీసులు కేసు నమోదు చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఈనెల 19న తెలంగాణ కేబినెట్‌ను విస్తరించిన కేసీఆర్ 10 మందికి అవకాశం కల్పించారు. అందులో నలుగురు పాతవారికి మళ్లీ చాన్స్ ఇచ్చారు. ఆరుగురు కొత్తవారికి కొత్తగా కేబినెట్లో చోటు కల్పించారు. అయితే, మహిళలకు కేబినెట్లో చోటు దక్కలేదు.

తెలంగాణ కొత్త కేబినెట్
గత ఐదేళ్ల పాలనలో కూడా కేసీఆర్ కేబినెట్లో మహిళకు అవకాశం దక్కలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మంత్రివర్గంలో మహిళలు ఏరని ప్రశ్నించగా, ఓ కొత్తమంత్రి ‘ఇంట్లో ఉన్నారు.’ అని వెటకారం చేసినట్టు వార్తలు వచ్చాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:February 21, 2019, 11:51 IST