పాకిస్తాన్ చెర నుంచి ప్రశాంత్‌ను విడిపిస్తాం.. కిషన్ రెడ్డి

శాంత్, వారీలాల్‌ను వీలైనంత త్వరంగా ఇండియాకు తీసుకొస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. అందుకోసం విదేశాంగశాఖ ద్వారా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

news18-telugu
Updated: November 23, 2019, 9:25 PM IST
పాకిస్తాన్ చెర నుంచి ప్రశాంత్‌ను విడిపిస్తాం.. కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఇద్దరు భారతీయ యువకులు పాకిస్తాన్ పోలీసుల చెరలో ఉన్న విషయం తెలిసిందే. విశాఖకు చెందిన ప్రశాంత్, మధ్యప్రదేశ్‌కు చెందిన వారీలాల్ బాహవల్‌పూర్ జైల్లో మగ్గుతున్నారు. వారి కోసం కుటుంబ సభ్యులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అక్కడ తమవారి పరిస్థితిని తలచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. త్వరగా తీసుకురావాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. తాజాగా వీరి అంశంపై తాజాగా స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ప్రశాంత్, వారీలాల్‌ను వీలైనంత త్వరంగా ఇండియాకు తీసుకొస్తామని తెలిపారు. అందుకోసం విదేశాంగశాఖ ద్వారా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

ఇక మహారాష్ట్రలో నెలకొన్న పొలిటికల్ హైడ్రామాపైనా మాట్లాడారు కిషన్ రెడ్డి. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ, శివసేన కూటమిని 167 స్థానాలతో గెలిపించారని.. కానీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా శివసేన వ్యవహరించిందని విమర్శించారు. ప్రజల తీర్పు గౌరవించే.. తమతో కలిసి వచ్చే వారితో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందని తెలిపారు. ఈ నెల 30న సభలో మెజార్టీ నిరూపించుకుంటామని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.


First published: November 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>