కాళేశ్వరానికి జాతీయ హోదా... తేల్చేసిన కేంద్రమంత్రి

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగే స్వేచ్ఛ ఆ రాష్ట్ర ఎంపీలకు ఉందని కిషన్ రెడ్డి అన్నారు.

news18-telugu
Updated: November 17, 2019, 5:21 PM IST
కాళేశ్వరానికి జాతీయ హోదా... తేల్చేసిన కేంద్రమంత్రి
కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్
  • Share this:
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్ సమావేశాల్లోనూ కేంద్రాన్ని డిమాండ్ చేసేందుకు ఆ పార్టీ ఎంపీ సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కేంద్రం వైఖరి ఏ రకంగా ఉండబోతోందనే అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముందుగానే క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగే స్వేచ్ఛ ఆ రాష్ట్ర ఎంపీలకు ఉందని కిషన్ రెడ్డి అన్నారు.

అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఓ కార్పొరేషన్ పెట్టుకుని కేంద్రం నుంచి నిధులు తెచ్చుకున్నారనీ..మళ్లీ జాతీయ హోదా అడగటం కరెక్ట్ కాదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేననీ..ఒక రాష్ట్రాన్ని ఎక్కువగా మరో రాష్ట్రాన్ని తక్కువగా చూడదని కిషన్ రెడ్డి అన్నారు. అయినా తాము కాళేశ్వారానికి జాతీయ హోదా ఇస్తామని ఎప్పుడు, ఎక్కడ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. పునర్విభజన చట్టంలోని అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్రం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>