కిషన్‌రెడ్డికి అమిత్ షా క్లాస్.. అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచన

కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కొంతమంది బీజేపీ నేతలు సమర్థించినా... ఇది అనవసర వివాదంగా మారుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భావించినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: June 1, 2019, 5:11 PM IST
కిషన్‌రెడ్డికి అమిత్ షా క్లాస్.. అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచన
అమిత్ షా, కిషన్ రెడ్డి
  • Share this:
దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా... దాని మూలాలు హైదరాబాద్‌లో ఉంటున్నాయన్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కొంతమంది బీజేపీ నేతలు సమర్థించినా... ఇది అనవసర వివాదంగా మారుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భావించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లకూడదని ఆయన కిషన్ రెడ్డికి క్లాస్ తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి వ్యాఖ్యల కారణంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టాలని భావిస్తున్న ఎన్‌ఆర్‌సీ(దేశ పౌర రిజిష్టర్) ప్రక్రియకు ఇబ్బందులు ఎదురవుతాయని అమిత్ షా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనితోపాటు అమిత్ షా హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇలాంటి వివాదాలు రావడం మంచిది కాదని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాద దాడుల జరిగినా... దాని మూలాలు హైదరాబాద్‌లో బయటపడుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పద కావడంతో... తన మాటలను వక్రీకరించారని క్లారిటీ ఇచ్చుకున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: June 1, 2019, 5:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading