టీడీపీ ఓడినా ఆ ఫ్యామిలీ గెలిచింది..ఒకే కుటుంబం నుంచి ముగ్గురు గెలుపు..

పార్టీ ఓడినా.. గెలిచిన ఫ్యామిలీ..

ఫ్యామిలీ నుంచి ముగ్గురుపోటీ చేసి విజయం సాధించారు. దివంగత నేత ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు, కుమారుడు రామ్మోహన్ నాయుడు, కుమార్తె భవానీ ఈ ఎన్నికల్లో గెలుపొందారు.

 • Share this:
  ఏపీ ఎన్నికల ఫలితాలు గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠని రేపాయి. ఈ సారి రిజల్ట్స్‌లో వైసీపీ ఓ సంచలనమే సృష్టించింది. ఫ్యాన్ గాలి హోరులో మిగతా పార్టీలన్నీ కొట్టుకుపోయాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి ఆ పార్టీ ఏకంగా 151 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించింది వైసీపీ. ఇంత కాంపిటీషన్‌లోనూ కింజరాపు కుటుంబం తమ సత్తాని చూపింది. ఫ్యామిలీ నుంచి ముగ్గురుపోటీ చేసి విజయం సాధించారు. దివంగత నేత ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు, కుమారుడు రామ్మోహన్ నాయుడు, కుమార్తె భవానీ ఈ ఎన్నికల్లో గెలుపొందారు.

  శ్రీకాకుళం టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు వరుసగా రెండోసారి విజయం సాధించారు. 8,857 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి పేరాడ తిలక్‌పై విజయం సాధించాడు. కౌంటింగ్ సమయంలో మొదటిరౌండ్‌లో వైసీపీ అభ్యర్థి లీడింగ్‌లో ఉన్నప్పటికీ చివరి రౌండ్లలో మంచి ఓట్లు వచ్చి అచ్చెన్నాయుడు గెలుపొందాడు.

  ఇటూ ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కూడా ఈ ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగురవేశాడు. శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేసిన ఈయన వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై 6,653 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొదట్నుంచీ ఈ విజయం రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్‌ల మధ్య దోబూచులాడినప్పటికీ చివరికీ రామ్మోహన్ నాయుడే విజయం సాధించాడు.

  ఇక రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎర్రన్నాయుడు కుమార్తె భవానీ కూడా ఈ ఎన్నికల్లో భారీ విజయంతో గెలుపొందారు. సీనియర్ నేత ఆదిరెడ్డి అప్పారావుకి కోడలైన ఈమె పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే భారీ మెజార్టీతో గెలుపొందడం విశేషం. తొలిరౌండ్ నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతూ వచ్చిన భవానీ వైసీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావుపై 30,065 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

  మొత్తానికీ అన్ని స్థానాల్లోనూ ఎన్నడూలేని విధంగా ఓటమి చూసిన టీడీపీకి ఇప్పుడు కింజరపు కుటుంబ నేతలే కీలకంగా మారారని చెప్పొచ్చు.
  First published: