ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే, ప్రకటన తేదీ ఖరారు

ప్రస్తుతం కళా వెంకట్రావు స్థానంలో కొత్తగా మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి పేరును ఖరారు చేసింది అధిష్టానం.

news18-telugu
Updated: September 23, 2020, 2:25 PM IST
ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే, ప్రకటన తేదీ ఖరారు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి పేరు దాదాపు ఖరారైంది. ప్రస్తుతం కళా వెంకట్రావు స్థానంలో కొత్తగా మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి పేరును ఖరారు చేసింది అధిష్టానం. పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమై కొత్త అధ్యక్షుడి ఎంపిక గురించి చర్చించారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు పేరును దాదాపు ఖరారు చేశారు. తెలుగుదేశం పార్టీకి మళ్లీ కొత్త జవసత్వాలు అందించాలంటే అచ్చెన్నాయుడు మాస్ ఇమేజ్, ఆయన దూకుడు స్వభావం కలిసి వస్తాయని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 27వ తేదీన అచ్చెన్నాయుడును ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించనన్నట్టు తెలిసింది. తెలుగుదేశం పార్టీకి బీసీ సామాజికవర్గం అండదండగా ఉంది. కానీ, 2019 ఎన్నికల్లో బీసీలు వైసీపీకి మద్దతుగా నిలిచారు. దీంతో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అదే సమయంలో 2019 ఎన్నికల తర్వాత నుంచి రాష్ట్రంలో బీసీ నేతలు, దళితుల మీద దాడులు జరుగుతున్నాయంటూ టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ బీసీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, యనమల రామకృష్ణుడు వంటి నేతలమీద కేసుల నేపథ్యంలో టీడీపీ ఈ ఆరోపణలు చేసింది. అయితే, వైసీపీ ఈ వాదనను కొట్టిపారేసింది. అవినీతికి, అక్రమాలకు, హత్యలు చేసే నేతలకు టీడీపీ అండగా ఉంటోందని ఎదురుదాడి చేసింది.

అచ్చెన్నాయుడు దూకుడుగా ఉండే నేత. టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత. అసెంబ్లీలో వైఎస్ జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ ఉంటారు. అలాంటి నేతను ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమిస్తే బీసీల్లో కోల్పోయిన పట్టును మళ్లీ సాధించవచ్చని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. కళా వెంకట్రావు కూడా వీలైనంత త్వరగా పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు. అచ్చెన్నాయుడు 2009 ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో టెక్కలి నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 23, 2020, 2:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading