• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • KIA MOTORS ROW HOW CAN YOU PROVIDE EMPLOYMENT IF COMPANIES ARE LEAVING ASKS PAWAN KALYAN BA

KIA Motors | కియా వివాదంపై జగన్ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న...

KIA Motors | కియా వివాదంపై జగన్ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న...

పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan)

‘ఉపాధి కల్పనకు ఆస్కారం ఉన్న రంగాలను ప్రోత్సహించకపోగా నిరుత్సాహకర పరిస్థితులు సృష్టిస్తే ఆర్ధికాభివృద్ధి ఏ విధంగా సాధ్యం అవుతుంది.’ అని పవన్ కళ్యాన్ ప్రశ్నించారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ నుంచి కియా మోటార్స్ తరలిపోతుందనే వివాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతుంటే ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు సానుకూల పరిస్థితులు నెలకొల్పాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరిస్తోంది. కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలు, సాఫ్ట్ వేర్ సంస్థలు రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోతున్నాయి. ఉన్న సంస్థలే వెళ్లిపోతుంటే ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగవుతాయి. కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఉన్న కియా పరిశ్రమలోని యూనిట్లు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయని వస్తున్న వార్తలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఈ వార్తను ప్రపంచానికి తెలియచేసింది ఏదో ఆషామాషీ సంస్థ కాదు. 'రాయిటర్స్' అనే ప్రఖ్యాత వార్తా సంస్ధ వెల్లడించింది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఇక్కడ బహుముఖంగా తన ప్లాంట్ విస్తరిస్తుంది అనుకొంటే ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లేందుకు సిద్దపడటం రాష్ట్ర ప్రభుత్వ విధాన లోపాలను తెలియచేస్తోంది.
  విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ నుంచి సాఫ్ట్ వేర్ సంస్థలను ఖాళీ చేయించడం ఆ రంగం ఇకపై ఆంధ్ర ప్రదేశ్ వైపు చూడకుండా చేయడమే అవుతుంది. ఒక సంస్ధ నూతనంగా పెట్టుబడి పెట్టి కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. ఉపాధి కల్పనకు ఆస్కారం ఉన్న రంగాలను ప్రోత్సహించకపోగా నిరుత్సాహకర పరిస్థితులు సృష్టిస్తే ఆర్ధికాభివృద్ధి ఏ విధంగా సాధ్యం అవుతుంది. ప్రకాశం జిల్లాలో రూ.24 వేల కోట్ల పెట్టుబడితో కాగితం పరిశ్రమ స్థాపిస్తామని ఒప్పందం చేసుకున్న ఏషియన్ పేపర్స్ అండ్ పల్ప్ పరిశ్రమ మహారాష్ట్రకు వెళ్ళిపోయింది. ఇలా రాష్ట్రానికి రావాల్సినవి, ఇప్పటికే ఉన్నవీ తరలిపోతుంటే ఏ విధంగా ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఉపాధి అవకాశాలు పెంచి వలసలు అరికట్టాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతలను వదిలేసి రద్ధులు, కూల్చివేతలు, తరలింపులు అంటోంది. నిర్మాణాత్మక ఆలోచనలు, ప్రణాళికలు లేని పాలక పక్షాన్ని చూసే పారిశ్రామిక సంస్థలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి అని ప్రభుత్వం గ్రహించాలి.’ అని ఓ ప్రకటనలో పవన్ కళ్యాన్ ఆక్షేపించారు.

  KIA Motors : కియా మోటార్స్‌ తరలింపు అంశంపై ఆ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు...
  KIA Motors : కియా మోటార్స్‌ తరలింపు అంశంపై ఆ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు...


  ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న కియా మోటార్స్ సంస్థ తమిళనాడు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉందంటూ రాయిటర్స్ వార్తాసంస్థ కథనాన్ని ప్రచురించింది. దీనిపై పెద్ద దుమారం రేగింది. జగన్ ప్రభుత్వం, కియా మోటార్స్ మధ్య వివాదం నడుస్తోందనే వాదన తెరపైకి వచ్చింది. అయితే, ఈ వాదనను ప్రభుత్వం ఖండించింది. కియా మోటార్స్, ప్రభుత్వం సంయుక్తంగా కలసి నడుస్తున్నాయని, ఎలాంటి వివాదాలు లేవని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.

  కియా తొలి కారు మీద ఆటోగ్రా ఫ్ ఇచ్చిన రోజా (Image:Roja Selvamani/Twitter)


  తెలుగుదేశం పార్టీ హయాంలో కియా మోటార్స్ ఏపీలో ఏర్పాటైంది. అయితే, ప్లాంట్ ఏర్పాటు చేసే సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ సంస్థకు ప్రభుత్వం తరఫున కొన్ని రాయితీలను ప్రభుత్వం ఇవ్వాలి. కానీ, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాయితీల విషయంలో వివాదం తలెత్తినట్టు ప్రచారం జరిగింది. దీంతోపాటు స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని జగన్ తీసుకొచ్చిన నిబంధన కియా మోటార్స్‌కు ఇబ్బందిగా మారిందని రాయిటర్స్ వార్తాసంస్థ ప్రచురించిన కథనంలో పేర్కొంది. ఇవన్నీ ఆలోచించిన తర్వాత కియాను తమిళనాడుకు తరలించే ఆలోచన చేస్తున్నారని, దీనిపై త్వరలో కంపెనీ, తమిళనాడు ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు జరగనున్నాయి.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  అగ్ర కథనాలు