• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • KIA IN TALKS OVER MOVING 1 1 BILLION DOLLARS PLANT OUT OF ANDHRA PRADESH REUTERS INDIA CLARIFIES AGAIN BA

వేరే రాష్ట్రానికి కియా... మరోసారి కుండబద్దలు కొట్టిన రాయిటర్స్...

వేరే రాష్ట్రానికి కియా... మరోసారి కుండబద్దలు కొట్టిన రాయిటర్స్...

కియా మోటార్స్ లోగో

కియా మోటార్స్ సంస్థ 1.1 బిలియన్ డాలర్ల విలువైన ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ బయట రాష్ట్రానికి తరలించేందుకు చర్చలు జరుపుతోందని రాయిటర్స్ వార్తాసంస్థ మరోసారి కుండబద్దలు కొట్టింది.

  • Share this:
    కియా మోటార్స్ సంస్థ 1.1 బిలియన్ డాలర్ల విలువైన ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ బయట రాష్ట్రానికి తరలించేందుకు చర్చలు జరుపుతోందని రాయిటర్స్ వార్తాసంస్థ మరోసారి కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు గతంలో ఆ సంస్థ చేసిన ట్వీట్‌కు సవరణలతో మరోసారి ట్వీట్ చేసింది.

    పాత ట్వీట్‌లో ఏముంది?
    కియా సంస్థ 1.1 బిలియన్ డాలర్ల విలువైన ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌‌లో ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతోంది.

    కొత్త ట్వీట్‌లో ఏముంది?
    సవరణ: కియా మోటార్స్ సంస్థ 1.1 బిలియన్ డాలర్ల విలువైన ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ బయటకు (ఆంధ్రప్రదేశ్‌కు కాదు) తరలించేందుకు చర్చలు జరుపుతోంది. అని తమకు సమాచారం ఉందంటూ ట్వీట్ చేసింది. అలాగే, పాత ట్వీట్‌ను డిలీట్ చేస్తున్నట్టు స్పష్టం చేసింది.

    రాయిటర్స్ చేసిన మొదటి ట్వీట్. దాని సవరణ
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు