Khushbu Sundar: నేడు బీజేపీలో చేరనున్న ఖుష్బూ?

సినీ నటి, మాజీ కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ సుందర్ బీజేపీలో చేరనున్నట్టు తెలిసింది. నేడు ఆమె బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: October 12, 2020, 4:39 AM IST
Khushbu Sundar: నేడు బీజేపీలో చేరనున్న ఖుష్బూ?
ఖుష్బూ సుందర్ (File)
  • Share this:
సినీ నటి, మాజీ కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ సుందర్ బీజేపీలో చేరనున్నట్టు తెలిసింది. నేడు ఆమె బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఖుష్బూ సుందర్ బీజేపీలో చేరనున్నట్టు గత చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడనున్నట్టు సమాచారం. సినిమాల ద్వారా దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న కుష్బూ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికారిక ప్రతినిధిగా పనిచేసిన కుష్బూ గత కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవలే కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యాపాలసీని సమర్ధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కుష్బూపై సీరియస్ అయ్యింది. అప్పటి నుంచే కుష్బూ బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను ఆమె ఖండించలేదు. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా, కుష్బూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. పార్టీకి రాజీనామా చేసిన కుష్బూ నేటి మధ్యాహ్నం బీజేపీలో చేరబోతున్నారని సమాచారం. కుష్బూ రాకతో తమిళనాడు బీజేపీకి కొత్త గ్లామర్ వచ్చినట్టే అని చెప్పాలి. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కుష్బూ చేరికతో బీజేపీకి కొంతమేర అదనపు బలం పెరుగుతుందని చెప్పొచ్చు.

2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉంది అన్నాడీఎంకే. మరోవైపు ఈసారి ఎలాగైనా గెలవాలని డీఎంకే కృతనిశ్చయంతో ఉంది. డీఎంకే, కాంగ్రెస్ కలసి కట్టుగా ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అన్నాడీఎంకే, బీజేపీ కలసి బరిలోకి దిగే చాన్స్ ఉంది. తమిళనాట రాజకీయాలకు, సినీ గ్లామర్‌కు ఉన్న సంబంధం తెలిసిందే. రాజకీయాల్లోనూ సినిమా వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఈ క్రమంలో తమిళనాట బీజేపీకి సినీ గ్లామర్ అందించడం కోసం ఖుష్బూను కమలం వైపు తీసుకొచ్చేందుకు చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. చివరకు ఆ విషయంలో బీజేపీ విజయం సాధించింది.

తమిళనాట ఖుష్బూకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాలంటే ఓ ఉదాహరణ గురించి చెప్పాలి. ఖుష్బూ సుందర్ మీద అభిమానంతో ఆమెకు గుడి కూడా కట్టారు అభిమానులు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఖుష్బూను బీజేపీలో చేర్చుకుంటే పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని కమలం పార్టీ అభిప్రాయం. అయితే, ఖుష్బూ సుందర్ పూర్తి తమిళవాది. హిందీని బలవంతంగా రుద్దే అంశానికి ఆమె వ్యతిరేకి. భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాదని ఆమె చాలా సార్లు స్పష్టం చేశారు. ప్రాంతీయ సినిమాల మీద వివక్ష చూపుతున్నారంటూ కూడా మండిపడ్డారు. అలాగే జల్లికట్టుకు ఉద్యమానికి కూడా ఆమె మద్దతు పలికారు.

1986లో కలియుగ పాండవులు సినిమాతో ఖుష్బూ హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత తమిళం మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. దక్షిణాది సినిమాల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత 2010లో డీఎంకేలో చేరారు. అప్పటి డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఆ తర్వాత 2014లో డీఎంకేను వీడారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 12, 2020, 4:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading