ఖమ్మంలో టీఆర్ఎస్‌కు షాక్.. జిల్లా అధ్యక్షుడి రాజీనామా!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.

news18-telugu
Updated: November 26, 2018, 10:56 AM IST
ఖమ్మంలో టీఆర్ఎస్‌కు షాక్.. జిల్లా అధ్యక్షుడి రాజీనామా!
trs budan baig
news18-telugu
Updated: November 26, 2018, 10:56 AM IST
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బుడాన్ బేగ్.. పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బుడాన్ బేగ్‌తో పలువురు ప్రజాకూటమి నేతలు సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది.

పార్టీ ఆవిర్భావం నుంచి ఖమ్మంలో కీలకనేతగా పనిచేశారు బుడాన్ బేగ్. అందుకే ఆయనను, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు కేసీఆర్. కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న బుడాన్ బేగ్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాకూటమి నేతలు ఆయననను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. బేగ్ టీఆర్ఎస్‌ను వీడనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఖమ్మంలో జరగున్న బహిరంగసభలో.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనే అవకాశం ఉంది.

బుడాన్ బేగ్ టీఆర్ఎస్‌కు రాజీనామా చేయనున్నారనే వార్త పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. బేగ్‌ పార్టీని వీడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనను బుజ్జగిస్తున్నారు. ఆదివారం జరిగిన ఇబ్రహీం పట్నం ప్రజా ఆశీర్వాద సభలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామమల్లేష్.. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ప్రజాకూటమి నేతలు టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బుడాన్ బేగ్‌తో సంప్రదింపులు జరపడం చర్చనీయాంశమైంది.

 

First published: November 26, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...