ప్రజాకూటమి సభకు సర్వం సిద్ధం.. నేతల మధ్య మాటల యుద్ధం

ప్రచారం హోరు పెరుగుతున్నాకొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ చీఫ్ రాహుల్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేదికను పంచుకోబోతున్న వేళ.. ఖమ్మంలో బుధవారం జరగనున్న ప్రజాకూటమి బహిరంగసభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

news18-telugu
Updated: November 27, 2018, 8:38 PM IST
ప్రజాకూటమి సభకు సర్వం సిద్ధం.. నేతల మధ్య మాటల యుద్ధం
తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు
  • Share this:
భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు తొలిసారిగా ఒకే వేదికపై కనిపించబోతున్న ఖమ్మం ప్రజాకూటమి బహిరంగసభపై.. ఇద్దరు అగ్రనేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను ఆపేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే సభకు హాజరు కావాలని, ప్రచారం చేయాలని అధికార టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుండగా.. చంద్రబాబుపై అసత్యఆరోపణలు చేస్తున్నారని కూటమి నేతలు అంటున్నారు.

తెలంగాణ రైతులకు ద్రోహం చేస్తున్న చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ఖమ్మం వస్తున్నారని హాజరవుతారని.. సభలో ప్రజలకు ఏం చెబుతారని టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్రావు ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని చీకటి రోజుగా ప్రకటించిన టీడీపీ అధినేతకు.. ఓట్లడిగే అర్హత లేదన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రానికి రాసిన లేఖలను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని, ఆ విషయాన్ని ఖమ్మం సభలో ప్రకటించాలని డిమాండ్ చేశారు.

తుమ్మల నాగేశ్వర్రావు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి అభ్యర్థి నామా నాగేశ్వర్రావు. తుమ్మల తన మూలాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఖమ్మం అభివృద్ధికి చంద్రబాబు ఎంతో చేశారని, ఆ విషయం తుమ్మలకు కూడా తెలిసినా.. ఇలాంటి విమర్శలు చేయడం బాధాకరమన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశానడం అవాస్తవమన్నారు. అలాంటి చంద్రబాబుకు క్షమాపణ చెప్పే అవసరం లేదన్నారు.

అధికార, ప్రతిపక్ష పార్టీల అగ్రనేతల మధ్య పేలుతున్న మాటల తూటాలతో .. బుధవారం ఖమ్మంలో జరిగే ప్రజాకూటమి బహిరంగసభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సభను సక్సెస్ చేసేందుక కూటమి నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా జనసమీకరణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 

 
First published: November 27, 2018, 8:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading